https://oktelugu.com/

‘క్రాక్’ నుంచి దీపావళి సర్ ప్రైజ్.. ‘భూమ్ బద్దల్’ సాంగ్..!

మాస్ మహారాజ్ రవితేజ హిట్టు కొట్టాలని కసితో చేస్తున్న చిత్రం ‘కాక్’. ఈ మూవీతో మళ్లీ తన సత్తాను చాటాలని రవితేజ ఉవ్విళ్లురుతున్నారు. ‘క్రాక్’ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్టు లుక్.. టీజర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘క్రాక్’ యూనిట్ దీపావళి సందర్భంగా ‘భూమ్ బద్దల్’ ఐటమ్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపింది. Also Read: ‘కొమురంభీం’ ప్రభంజనం. టాలీవుడ్లో సరికొత్త రికార్డు సెట్ చేసిన ఎన్టీఆర్..! క్రాక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 12:38 PM IST
    Follow us on

    మాస్ మహారాజ్ రవితేజ హిట్టు కొట్టాలని కసితో చేస్తున్న చిత్రం ‘కాక్’. ఈ మూవీతో మళ్లీ తన సత్తాను చాటాలని రవితేజ ఉవ్విళ్లురుతున్నారు. ‘క్రాక్’ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్టు లుక్.. టీజర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘క్రాక్’ యూనిట్ దీపావళి సందర్భంగా ‘భూమ్ బద్దల్’ ఐటమ్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపింది.

    Also Read: ‘కొమురంభీం’ ప్రభంజనం. టాలీవుడ్లో సరికొత్త రికార్డు సెట్ చేసిన ఎన్టీఆర్..!

    క్రాక్ మూవీలో రవితేజ కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. వీరిద్దరు గతంలో ‘బలుపు’ మూవీ నటించగా తాజాగా మరోసారి ‘క్రాక్’లో నటిస్తున్నారు. ఈ మూవీని దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. రవితేజ-గోపిచంద్ కాంబినేషన్లో ఇప్పటికే డాన్ శ్రీను.. బలుపు చిత్రాలు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచాయి. వీరిద్దరి హ్యట్రిక్ కాంబోగా ‘క్రాక్’ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుగా రాబోతుంది.

    ‘క్రాక్’లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతుందని సమాచారం. దీపావళిని పురస్కరించుకుని ‘క్రాక్’ చిత్ర యూనిట్ ‘భూమ్ బద్దల్’ లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదలైంది. ‘భూమ్ బద్దలు.. భూమ్ బద్దలు.. నా ముద్దుల సౌండు’ అంటూ సాగే ఈ మాస్ బీట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

    Also Read: ‘మా వింత గాధ వినుమా’ రివ్యూ: హిట్టా.. ప్లాపా?

    ఈ స్పెషల్ సాంగ్లో అప్పర రాణి అందాల అరబోతకుతోడు రవితేజ స్టెప్పులు అలరించాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు తమన్ అదిరిపోయే స్వరాలు అందించాడు. సింగర్స్ సింహా.. మంగ్లీలు మాస్ బీట్ తగ్గట్టుగా ఫుల్ ఎనర్జీతో పాటను ఆలపించారు. మేకింగులో జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేస్తుండగా రవితేజ.. అప్పర రాణిలు జోష్ తో డాన్సులు వేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘భూమ్ బద్దలు’ సాంగ్స్ లో మాస్ మాహారాజ్ స్టెప్పులు.. అప్సరరాణి అందాల అరబోతకు థియేటర్లలో భూమి బద్దలవడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘క్రాక్’ మూవీ సంక్రాంతి రేసులో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకోసం విడుదల కోసం రవితేజ అభిమానులు అత్రుతగా ఎదురు చూస్తున్నారు.