https://oktelugu.com/

ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. కార్డుపై రూ. 10 వేల డిస్కౌంట్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై, డెబిట్ కార్డులపై కూడా కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు పండుగ సమయంలో షాపింగ్ చేయడం ద్వారా ఏకంగా 10 వేల రూపాయల డిస్కౌంట్ ను పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి హావెల్స్‌ కొనుగోలు చేస్తే ఏకంగా 4,000 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఎల్‌జీ ఉత్పత్తులను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2020 / 12:19 PM IST
    Follow us on


    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై, డెబిట్ కార్డులపై కూడా కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు పండుగ సమయంలో షాపింగ్ చేయడం ద్వారా ఏకంగా 10 వేల రూపాయల డిస్కౌంట్ ను పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి హావెల్స్‌ కొనుగోలు చేస్తే ఏకంగా 4,000 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.

    ఎల్‌జీ ఉత్పత్తులను కొనుగోలు చేసిన కస్టమర్లు గరిష్టంగా 3,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. ఫ్యాబ్‌ఇండియాలో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుండగా గరిష్టంగా 1000 రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. క్యారెట్‌లేన్‌లో 1,500 రూపాయల వరకు, క్రోమాలో 2,500 రూపాయల వరకు క్యాష్ బ్యక్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో లావాదేవీలు జరిపితే మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.

    మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌ లో 3,000 రూపాయల వరకు, శాంసంగ్ ఉత్పత్తులపై గరిష్టంగా 6,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను సొంతం చేసుకోవచ్చు. పామ్స్ టౌన్ అండ్ కంట్రీ క్లబ్ ‌లో మెంబర్ షిప్ కోసం జాయిన్ అయితే ఏకంగా 10,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా షాపింగ్ చేస్తే పలు ఈకామర్స్ సంస్థలు సైతం క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇస్తున్నాయి.

    ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే ఆన్ లైన్ లో లేదా సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది. అన్ లైన్ లో డాక్యుమెంట్లు సమర్పించి నచ్చిన కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్లను పరిశీలించి బ్యాంకు అధికారులు క్రెడిట్ కార్డును మంజూరు చేస్తారు.