Gayatri Gupta Comments About Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఎవరికి వారు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతుండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినా కూడా కొంతమందికి మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. మరి అలాంటి వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసి పెట్టాయి. నిజానికి సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడనే విషయం మనకు తెలిసిందే. ఇక తను దర్శకుడుగానే కాకుండా మానవత్వాన్ని చాటుకునే మనిషిగా కూడా చాలా గొప్ప కార్యక్రమాలు చేపడుతూ ఉంటారని కొంతమంది ఆర్టిస్టులు చెబుతున్నారు. నిజానికి ఫిదా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన గాయత్రి గుప్తా గురించి మనందరికి తెలుసు… ఆమె కొన్ని కాంట్రవర్సీల్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులకు గురైన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆమె ఒక పోర్డ్ కాస్ట్ లో పాల్గొన్నప్పుడు ఆమెకు తీవ్రమైన అనారోగ్యమైతే కలిగిందట. ఒక వింత వ్యాధితో ఆమె బాధపడుతున్న సందర్భంలో ఆమెకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే ఎదురైందట…
Also Read: ‘రావు బహదూర్ ‘ సినిమా టీజర్ ఏంటి భయ్యా ఇలా ఉంది…రాజమౌళి ట్వీట్ సంగతేంటి..?
ఇలాంటి సందర్భంలోనే తనకు ఫ్రెండ్ అయిన సందీప్ రెడ్డి వంగ కి చిన్న మెసేజ్ పెట్టి ఈ సిచువేషన్ లో తను ట్రీట్మెంట్ తీసుకోవడం కంపల్సరీ అని చెప్పడంతో ఆయన తనకి మెడికల్ రిపోర్ట్స్ పంపించమని చెప్పారట. ఆమె మెడికల్ రిపోర్ట్స్ పంపించడంతో ఇమ్మీడియట్ గా ఆయన 5 లక్షల రూపాయలను సెండ్ చేశారట. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఏదైనా డబ్బులు అవసరం ఉంటే నన్ను అడగండి అని గాయత్రి గుప్తాకు చెప్పడంతో ఆమె వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందట.
ఇక మొత్తానికైతే ఆమె దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు సందీప్ రెడ్డివంగా ఒక్క మెసేజ్ తో తనకు రెస్పాండ్ అయి డబ్బులు ఇచ్చాడు అని అతని గురించి చాలా గొప్పగా చెబుతోంది. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగ కి అందరూ చాలా పొగరు ఉందని అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడంటూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు.
కానీ మొదటిసారి గాయత్రి గుప్తా సందీప్ గురించి గొప్పగా చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజానికి ఇప్పటివరకు ఈ న్యూస్ ను సందీప్ ఎక్కడ చెప్పుకోలేదు…అయితే గాయత్రి కి సందీప్ కి మధ్య చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉందని అందుకే ఆయన ఆమెకి హెల్ప్ చేశాడు అంటూ కొందరు కొన్ని కామెట్లైతే చేస్తున్నారు….