Pawan Kalyan- Kota Srinivasa Rao: తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించే దగ్గ నటులలో ఒకడు కోట శ్రీనివాసరావు. సుమారుగా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్ లో ఆయన వెయ్యనటువంటి పాత్రలు లేవు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి తన నటవిశ్వరూపం తో ప్రేక్షకులను మైమర్చిపొయ్యేలా చెయ్యడం ఆయన స్పెషాలిటీ. కొత్తగా వచ్చే నటీనటులకు ఆయన నటన ఒక పుస్తకం లాంటిది.
విలనిజం అయినా, కామెడీ అయినా, సెంటిమెంట్ అయినా ప్రేక్షకుల చేత శబాష్ అని అనిపించుకోవడం కోటశ్రీనివాస రావు కి కొత్తేమి కాదు.నటుడిగా ఆయనకీ వంకలు పెట్టడానికి ఏమి లేవు, ప్రతీ ఒక్కరు గౌరవిస్తారు. కానీ ఆయన ఈ వయస్సులో చేస్తున్న కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ ఆయన విలువని తగ్గించేలా చేస్తుంది. ఆయన చేసే కామెంట్స్ పై యాంకర్ అనసూయ మరియు మెగా బ్రదర్ నాగబాబు పలుమార్లు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఎదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేసే కోట శ్రీనివాసరావు, ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసాడు.
మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి ని పురస్కరించుకొని రీసెంట్ గా ఒక చిన్న ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి కోటశ్రీనివాస రావు రామారావు గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు, అంత వరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పరోక్ష కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు సంచలనం గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘రామారావు గారు మహానటుడు, కానీ అప్పట్లో ఆయన రెమ్యూనరేషన్ గురించి ఎక్కడైనా బయట చెప్పుకున్నాడా? , కానీ ఈమధ్య కొంతమంది రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నాను, 3 కోట్లు తీసుకుంటున్నాను అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు’ అంటూ కోటశ్రీనివాస రావు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఆరోజు తన పారితోషికం గురించి చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది, ఆ కారణం ఏంటో అందరూ చూసారు. కోట శ్రీనివాసరావు అది తెలిసి కూడా ఇలా కామెంట్ చెయ్యడం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.