https://oktelugu.com/

NTR: ఆయనకు ఎన్టీఆర్ లో తన కొడుకు కనిపించాడు !

NTR: జూనియర్ ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు అవి. ‘బృందావనం’లో కోట శ్రీనివాసరావు పాత్ర కీలకమైనది. అయితే, ఆ సమయంలోనే కోట గారి కుమారుడు యాక్సిడెంట్ లో చనిపోయారు. అది జరిగి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు. ‘బృందావనం’ షూటింగ్‌ మొదలైంది. కోట డేట్లు వచ్చాయి. కానీ, కోట మాత్రం సినిమా చేసే పరిస్థితిలో లేరు. ఆ సినిమాలో కోట గారిది తాత వేషం. పైగా ఆయనకు హీరోకి మధ్య మంచి సన్నివేశాలు […]

Written By:
  • Shiva
  • , Updated On : November 6, 2021 / 05:57 PM IST
    Follow us on

    NTR: జూనియర్ ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు అవి. ‘బృందావనం’లో కోట శ్రీనివాసరావు పాత్ర కీలకమైనది. అయితే, ఆ సమయంలోనే కోట గారి కుమారుడు యాక్సిడెంట్ లో చనిపోయారు. అది జరిగి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు. ‘బృందావనం’ షూటింగ్‌ మొదలైంది. కోట డేట్లు వచ్చాయి. కానీ, కోట మాత్రం సినిమా చేసే పరిస్థితిలో లేరు.

    ఆ సినిమాలో కోట గారిది తాత వేషం. పైగా ఆయనకు హీరోకి మధ్య మంచి సన్నివేశాలు ఉన్నాయి. అందుకే, నిర్మాత దిల్‌ రాజు ‘ఆలస్యం అయినా సరే ఆ పాత్ర ఒక్క కోట గారే చేయాలి’ అంటూ షూటింగ్ కూడా పోస్ట్ ఫోన్ చేశారు. ఈ విషయం కోట శ్రీనివాసరావుకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే కోట మనసు మారింది. కొడుకు పోయిన బాధలో ఉండి కూడా.. ఒక నటుడిగా నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన తిరిగి షూట్ కి వచ్చారు.

    మొదటిరోజు ఎన్టీఆర్ తో సీన్. అప్పటికే తారక్ తో కోట గారు కొన్ని సినిమాలు చేశారు. కానీ, ‘బృందావనం’ సినిమా మాత్రం ప్రత్యేకం. కారణం… ఆ సినిమా సమయంలోనే ఎన్టీఆర్ కి కోట గారికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇక సీన్ షూట్ స్టార్ట్ అయింది. మొదటి సీన్ లోనే కోట గారు కూర్చుని తాగుతూ అటుగా వెళ్తున్న ఎన్టీఆర్ ను పిలుస్తూ ‘రా తాతా రా’ అంటాడు.

    ఆ సమయంలో ఆయనకు ఎన్టీఆర్ లో తన కొడుకు కనిపించాడట. ఎన్టీఆర్ వచ్చి పక్కన కూర్చోగానే కోట గారు ఒక్కసారిగా బోరున ఏడ్చారు. పక్కన ఎన్టీఆర్ ఆయనను దగ్గరకు తీసుకుని ఓదార్చిన తీరు చూసి, సినిమా యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. కోట గారితో పాటు ఎన్టీఆర్ కూడా అంత గొప్పగా ఎమోషనల్ అయ్యాడు కాబట్టి.. ఆ మందు సీన్ అంత అద్భుతంగా పడింది.

    Also Read: Sonu Sood: చిరు వ్యాపారులకు అండగా ఉండాలంటున్న సోనూసూద్​.. ట్వీట్టర్​లో వీడియో వైరల్​!

    ఆ చిత్రంలో ఎన్టీఆర్ – కోట గారి మధ్య సీన్స్ అన్నీ బాగా పేలాయి. పైగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా గమ్మత్తుగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఇద్దరూ ఆ టెంపోను బాగా మెయింటెయిన్ చేశారు. ఒకపక్క ఫ్రేమ్ లో దిగ్గజాల్లాంటి నటులు శ్రీహరి, ప్రకాశరాజ్‌ వంటి వారు ఉన్నా.. ఆ సినిమాలో హైలైట్ గా నిలిచింది మాత్రం ఎన్టీఆర్ – కోట కాంబినేషనే.

    Also Read:Kalyan Ram: ఈ కథకు సెట్ కాదు, దర్శకుడి వాదన.. నా మార్కెట్ కి వర్కౌట్ కాదు, హీరో వాదన !

    Tags