https://oktelugu.com/

Kota Srinivasa Rao, Babumohan: కోట కోపం.. బాబు మోహన్ బిక్క మొహం !

Kota Srinivasa Rao, Babumohan: రాజమండ్రిలో ఏదో సినిమా షూటింగ్ కి కలిసి వెళ్లారు కోట(Kota)- బాబూమోహన్(Babumohan). మొదటి నుండి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పైగా ఆ రోజుల్లో కామెడీ ట్రాక్స్ అన్ని వీరిద్దరి చుట్టే సాగేవి. దాంతో షూటింగ్ కి కూడా కలిసే వెళ్లి కలిసే వస్తూ.. చాలా వరకు కలిసే ట్రావెల్‌ చేసేవాళ్లు. ఐతే హైదరాబద్ లో ఏదో షూటింగ్‌ జరుగుతుంది. కోట – బాబూమోహన్ ఇద్దరిలో టెన్షన్ మొదలైంది. తెల్లారితే.. […]

Written By:
  • admin
  • , Updated On : August 20, 2021 / 06:46 PM IST
    Follow us on

    Kota Srinivasa Rao, Babumohan: రాజమండ్రిలో ఏదో సినిమా షూటింగ్ కి కలిసి వెళ్లారు కోట(Kota)- బాబూమోహన్(Babumohan). మొదటి నుండి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పైగా ఆ రోజుల్లో కామెడీ ట్రాక్స్ అన్ని వీరిద్దరి చుట్టే సాగేవి. దాంతో షూటింగ్ కి కూడా కలిసే వెళ్లి కలిసే వస్తూ.. చాలా వరకు కలిసే ట్రావెల్‌ చేసేవాళ్లు. ఐతే హైదరాబద్ లో ఏదో షూటింగ్‌ జరుగుతుంది. కోట – బాబూమోహన్ ఇద్దరిలో టెన్షన్ మొదలైంది.

    తెల్లారితే.. రాజమండ్రిలో ఇద్దరు మోహన్ బాబు సినిమా షూట్ లో పాల్గొనాలి. అసలుకే, మోహన్ బాబు ఆవేశపరుడు. లేటుగా వెళ్తేనే సహించడు, అలాంటిది షూటింగ్ కి డుమ్మా కొడితే ఇంకేమైనా ఉందా ?, ఇక్కడ షూట్ ముగించుకుని.. ఆదరాబాదరా రైలెక్కి మరుసటి రోజు కల్లా రాజమండ్రికి చేరుకోవాలనుకున్నారు.

    కానీ, ఇక్కడ షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పట్లేదు డైరెక్టర్. ఇక చేసేది ఏమి లేక గంట సేపు ఎదురు చూశారు. సమయం అయిపోయింది. మేకప్‌ తీసేసి గబగబా స్టేషనకి చేరుకుని ఎలాగోలా ట్రైన్ ఎక్కారు. కోట బాగా అలిసిపోయాడు. రాత్రి పదిన్నర టైమ్ అవుతుంది. బాబు మోహన్ తో ‘తెల్లారుజామున ఐదు గంటలకు లేవాల్రా. నేను పడుకుంటా. నువ్వు మెలకువగా ఉండు’ అని నిద్రలోకి జారుకున్నాడు.

    బాబు మోహన్ కూడా నిద్రలో జారుకుని.. కొంత సమయం తర్వాత హఠాత్తుగా లేచాడు. చుట్టూ చూస్తే స్టేషన్ కనిపించింది. వెంటనే అన్నా ‘లేలేలే. స్టేషన్ వచ్చింది. మనం దిగాలి’ అంటూ నిద్రమత్తులో ఉన్న కోటను బలవంతగా దించాడు. కోట స్టేషన్‌లో దిగి, సూట్‌ కేస్‌ మోసుకుంటూ చుట్టూ చూశాడు. అనుమానం వచ్చింది.

    పక్కన ఉన్న వ్యక్తితో ఇది రాజమండ్రి స్టేషనేనా అండి ? అంటూ డౌట్ గా అడిగాడు. ఇది రాజమండ్రి ఏమిటండీ.. బెజవాడండీ బాబు అంటూ ఆ వ్యక్తి బదులు ఇచ్చాడు. అంతే.. కోట కోపంగా పళ్ళు నూరుతూ బాబు మోహన్ వైపు చూశాడు. బాబు మోహన్ బిక్క మొహం పెట్టి కోటకు దూరంగా జరిగాడు.