Naga Shaurya: నిర్మాతలు మెచ్చిన మంచి మార్కెట్ వున్న హీరో

టాలీవుడ్ లో బోలెడంత మంది హీరోలున్నారు. 50 కోట్లకు మించిన పారితోషికాలు అందుకుంటున్న వారున్నారు. చిన్న హీరోలు సైతం ఈ మధ్య బాగానే సంపాదించేస్తున్నారు. అయితే నిర్మాతలు మెచ్చిన హీరోలు కొందరే ఉన్నారు. అందులో ఒకరే.. హీరో నాగశౌర్య.. ఆయన పేరులోని శౌర్యం సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగశౌర్యనే అని చెప్పక తప్పదు. అన్ని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడిగా పేరొందాడు. నిర్మాతల […]

Written By: NARESH, Updated On : August 21, 2021 12:16 pm
Follow us on

టాలీవుడ్ లో బోలెడంత మంది హీరోలున్నారు. 50 కోట్లకు మించిన పారితోషికాలు అందుకుంటున్న వారున్నారు. చిన్న హీరోలు సైతం ఈ మధ్య బాగానే సంపాదించేస్తున్నారు. అయితే నిర్మాతలు మెచ్చిన హీరోలు కొందరే ఉన్నారు. అందులో ఒకరే.. హీరో నాగశౌర్య.. ఆయన పేరులోని శౌర్యం సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగశౌర్యనే అని చెప్పక తప్పదు. అన్ని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడిగా పేరొందాడు. నిర్మాతల హీరోగా ఈయన పేరు తెచ్చుకున్నాడు. సినిమా హిట్ అయితే పర్సంటేజీలు, సినిమాకు ముందే భారీ పారితోషకాలు లాంటివేవి డిమాండ్ చేయకుండా సినిమా కోసం కష్టపడి పనిచేసే హీరో అని.. ఎంత ఇచ్చినా తీసుకునే మనసున్న నటుడన్న టాక్ టాలీవుడ్ లో ఉంది. ఇలాంటి హీరోతో సినిమా తీయాలని చాలా మంది నిర్మాతలు ఎగబడుతుంటారంటే అతిశయోక్తి కాదేమో..

చిన్న ప్రొడ్యూసర్ల పాలిట వరంగా నాగశౌర్య ఉన్నాడన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.. కోట్లకు కోట్లు బడ్జెట్ పెంచి.. భారీ తారాగణం లాంటివి డిమాండ్ చేయకుండా తక్కువ బడ్జెట్ లో సర్ధుకుపోయే హీరోగా నాగశౌర్య అని టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్నాడు. పెద్దగా ఆశించడని.. కెరీర్ కోసం తపనపడే నటుడని చెబుతుంటారు. అతడి సినిమాలన్నీ కూడా మంచి టాక్ తో నడిచి నిర్మాతలకు లాభాలే తెచ్చిపెడుతున్నాయి. హిందీ మార్కెట్ లో కానీ.. తెలుగు మార్కెట్ లో కానీ.. చిన్న ప్రొడ్యూసర్ల పాలిట నాగశౌర్య ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరోలను చూసుకుంటే కొంతమంది మాస్ హీరోలుగా ఉన్నారు. కొంతమంది క్లాస్ హీరోలున్నారు. కానీ ఈ క్లాస్, మాస్ కలగలిపి చేయగల హీరో తెలుగులో ఒక్క నాగశౌర్య మాత్రమే. రెండూ పాత్రలను పోషిస్తూ ఒక మినిమం గ్యారెంటీ సినిమా ఇవ్వగల హీరో ఇతడే.. ప్రొడ్యూసర్ ఒక సినిమా తీశాడంటే ఆ హీరోకు మార్కెట్ ఉందా? లేదా? ఇప్పుడు క్రేజ్ ఉందా? అన్న డౌట్లు చాలానే ఉంటాయి. కానీ నాగశౌర్య మాత్రం మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అదే అతడిని నిర్మాతలకు దగ్గర చేస్తోంది.

నాగశౌర్య మార్కెట్ రేంజ్ ప్రస్తుతం రూ.9 నుంచి రూ.12 కోట్లుగా ఉంది. తెలుగు, హిందీ శాటిలైట్ రైట్స్,  ఓవర్సీస్ డిజిటల్ సహా అన్ని హక్కులు కలిపి 12 కోట్ల వరకూ వసూలు చేయగల సత్తా ఉంది. ఇక నిర్మాతలతో ఎలాంటి వివాదాలు, విభేదాలు పెట్టుకోకుండా అనుకూలంగా ఉంటూ తన ఇమేజ్ ను పెంచుకుంటున్న ఏకైక హీరో అని చెప్పొచ్చు.

తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో డిమాండ్ ఉన్న నాగశౌర్యతో సినిమా అంటే రూ.9 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మంచి కథా, కథనం సబ్జెక్ట్ ఉంటే అంతకుమించి కూడా సినిమాకు డబ్బులు ఇవ్వడానికి వెనుకాడని పరిస్థితి ఉంది. ఒకప్పుడు కెరీర్ ప్రారంభంలో హీరో నాని ఎలాగైతే నిర్మాతల పాలిట కల్పతరువుగా ఉన్నాడో ఇప్పుడు అదే స్థానంలోకి నాగశౌర్య వచ్చేశాడు. టాలీవుడ్ లో మంచి మార్కెట్ ను సంపాదించుకొని ఇప్పుడు నిర్మాతల పాలిట ఆపద్భాంధవుడిగా మారాడని టాలీవుడ్ లో ఓ టాక్ ఉంది.