Kota Srinivasa Rao
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సినిమాలు తగ్గించేశారు. తగ్గించారు అనడం కంటే ఆయనకు అవకాశాలు రావడం లేదని చెప్పొచ్చు. వృద్ధాప్యం కారణంగా ఒకప్పటి చురుకుతనం ఆయనలో లేదు. మాట కూడా మారిపోయింది. ఎక్కడో మెల్లగా మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయనకు రిటైర్ అయ్యే ఆలోచన లేదు. అవకాశాలు రావడం లేదని బాధపడుతున్నారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కోటా ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పని లేక పిచ్చెక్కుతుందన్న ఆయన అవకాశాల కోసం పలువురిని అడుగుతున్నట్లు వెల్లడించారు. నాకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. ఇంకా నటించాలనుకుంటుంది డబ్బుల కోసం కాదు.
Kota Srinivasa Rao
ఇంట్లో ఖాళీగా ఉండటం నాకు నచ్చదు. ఒక విధంగా చెప్పాలంటే పిచ్చెక్కిపోతుంది. పిల్లలతో ఆడుకున్నా ఆ బాధ తీరడం లేదు. అందుకే నాకు ఎలాంటి సాయం అవసరం లేదు మీ సినిమాల్లో వేషం ఇవ్వండి అంటూ అడుగుతున్నాను. దిల్ రాజు, త్రివిక్రమ్, వంశీ పైడిపల్లి కనిపిస్తే మీ సినిమాలో వేషం ఉంటే ఇవ్వండని అడుగుతుంటాను. ఆ మధ్య మహేష్ బాబు ఎదురు పడితే ఇలానే అడిగాను. మీలాంటి సీనియర్ నటులు అంతగా అడగాలా?.. అని మహేష్ అన్నారు. ఎన్టీఆర్, నాని లాంటి హీరోలు కలిసినా ఇలానే అడుగుతాను. అందులో తప్పేమీ లేదని కోటా చెప్పుకొచ్చారు.
దశాబ్దాల పాటు తీరిక లేని నటుడిగా గడిపిన నాకు ఖాళీగా ఉండడం ఇబ్బందిగా ఉందని కోటా తెలియజేశారు. వయసు మీద పడినా నాకు ఏమీ కాలేదు. బాగా నటించగలను, డైలాగ్ డెలివరీ కూడా బాగానే ఉందని కోటా విశ్వాసం వ్యక్తం చేశారు. నిజానికి కోటా మాట తీరులో మార్పు వచ్చింది. ఆయన నడవలేకపోతున్నారు కూడాను. కృష్ణంరాజు పార్ధీవదేహాన్ని సందర్శించడానికి వచ్చిన కోటా శ్రీనివాసరావు చాలా బలహీనంగా కనిపించారు. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.
Kota Srinivasa Rao
ఎవరికైనా వార్ధక్యం వస్తుంది. అప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోక తప్పదు. ఇక ఈ మధ్య కోటా తెలుగు చిత్ర పరిశ్రమపై అనేక విమర్శలు చేశారు. హాస్య నటుడిగా వందల చిత్రాలు చేసిన కోటా ఈ తరం చిత్రాల్లోది హాస్యం కాదు కామెడీ అంటారు. తేడా ఏమిటంటే… ఎవరితోనైనా, ఎప్పుడైనా ఎంజాయ్ చేసేది హాస్యం.. కామెడీ అలా కాదు అంటారు. ఇటీవల విడుదలైన హీరో, కొండపొలం చిత్రాల్లో కోటా శ్రీనివాసరావు నటించారు.