Koratala Siva- NTR: ఎన్టీఆర్ 30కి ఎట్టకేలకు ముహూర్తం కుదిరందని తెలుస్తుంది. 2023 ప్రారంభంలోనే టైం ఫిక్స్ చేశారట. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారట. ఆర్ ఆర్ ఆర్ విడుదలై తొమ్మిది నెలలు కావస్తోంది. ఎన్టీఆర్ కొత్త చిత్రం స్టార్ట్ చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ చిత్ర మరో హీరో రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేసి 50 శాతానికి పైగా పూర్తి చేశారు కూడా. ఎన్టీఆర్, కొరటాల శివ మాత్రం మీన మేషాలు లెక్కబెడుతున్నారు. ఎన్టీఆర్ 30పై పెద్ద మొత్తంలో అయోమయం నెలకొంది. పలు పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఒక దశలో ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జరిగింది.

ప్రీప్రొడక్షన్ కి సంబంధించిన ఫోటోలు విడుదల చేసి కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ 30 రద్దయ్యిందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చాడు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు. అయితే పరిశ్రమ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. జనవరిలో సంక్రాంతి పండగ దినాన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారట. ఇక రెగ్యులర్ షూట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందట.
లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి త్వరితగతిన షూట్ పూర్తి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. కొరటాల శివ మూవీ స్టార్ట్ అయితే ఎన్టీఆర్ కి తీరిక కూడా దొరకదట. ఈ కారణంతోనే ఫ్యామిలీతో అమెరికా వెకేషన్ ప్లాన్ చేశారు అంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్ భార్య పిల్లలతో అమెరికా వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే ప్లాన్ చేశారట. దాదాపు ఒక నెల రోజులు ఎన్టీఆర్ అమెరికాలోనే ఉండనున్నారని సమాచారం. టూర్ నుండి వచ్చిన వెంటనే కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది.

కొరటాల భారీ పాన్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ప్రీలుక్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ అంచనాలు పెంచాయి. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ తో జతకట్టే హీరోయిన్ ఎంపిక జరగలేదు. ఆ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. జాన్వీ కపూర్, రష్మిక మందానతో పాటు పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. కొరటాల మూవీ అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నారు. సలార్ షూట్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్… సలార్ విడుదల తర్వాత ఎన్టీఆర్ 31 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. స్క్రిప్ట్ ఆల్రెడీ సిద్ధంగా ఉందని వినికిడి.