spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha: నాకు ఆ పిచ్చి లేదు... కీలకంగా మారిన సమంత కామెంట్స్!

Samantha: నాకు ఆ పిచ్చి లేదు… కీలకంగా మారిన సమంత కామెంట్స్!

Samantha: సమంత కెరీర్ జోరు మీదుంది. ఈ చెన్నై భామ పరిశ్రమలో 12 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు. టాలెంట్-లక్ కలిగిన రేర్ హీరోయిన్ సమంత. అందుకే ఆమెకు తిరుగులేకుండా పోయింది. మొదటి చిత్రం ఏమాయ చేశావే నుండి యశోద వరకు సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. సమంత కెరీర్ ఏనాడూ నెమ్మదించలేదు. కారణం… విజయాల శాతం చాలా ఎక్కువ. సమంత నటించిన చిత్రాల్లో పరాజయం పొందినవి చాలా తక్కువ. సమంత హీరోయిన్ గా చేస్తే హిట్ గ్యారెంటీ అనే ఒక సెంటిమెంట్ పరిశ్రమలో బలపడింది.

Samantha
Samantha

ఇన్నేళ్ల కెరీర్లో సమంత యాభైకి పైగా చిత్రాలు చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సమంత నటిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై కూడా సమంత తన మార్క్ క్రియేట్ చేశారు. సమంత ప్రధాన పాత్ర చేసిన ది ఫ్యామిలీ మాన్ 2 మంచి విజయం సాధించింది. ఈ యాక్షన్ క్రైమ్ సిరీస్ సమంతకు బాలీవుడ్ వర్గాల్లో పేరు తెచ్చింది. ది ఫ్యామిలీ మాన్ 2 తర్వాత సమంతకు హిందీలో ఆఫర్స్ వస్తున్నాయి.

సమంత దేశంలోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటున్నారట. అయితే ఆమెకు డబ్బు అంటే అంత పిచ్చి లేదని చెప్పడం విశేషం. నాకు డబ్బుపై వ్యామోహం లేదు. డబ్బుల కోసం నచ్చని రోల్స్ చేయను. సినిమాలో నా రోల్ నచ్చితేనే చేస్తాను. డబ్బులు వస్తాయి కదా అని చెత్త రోల్స్ చేయను అని సమంత కుండబద్దలు కొట్టారు. అయితే సమంత స్టేట్మెంట్ గతంలో చెప్పిన దానికి భిన్నంగా ఉంది.

Samantha
Samantha

కెరీర్ బిగినింగ్ లోనే సమంత హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక చిత్ర విజయంలో హీరో ప్రమేయం ఎంత ఉంటుందో హీరోయిన్ ప్రమేయం కూడా అంతే ఉంటుంది. అలాంటప్పుడు రెమ్యూనరేషన్స్ లో భారీ వ్యత్యాసం ఎందుకు ఉంటుందని, నేరుగా ప్రశ్నించారు. అప్పట్లో సమంత కామెంట్స్ సంచలనం రేపాయి. అయితే ఇన్నేళ్ల కెరీర్లో సమంత రెమ్యూనరేషన్ కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు రాలేదు. కాగా సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఖుషి, శాకుంతలం చిత్రాల్లో నటిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
Oktelugu Epaper
Exit mobile version