Devara: కొరటాల దేవర స్టోరీ ని ఎందుకు రివీల్ చేయడం లేదు…కథ ముందే చెప్పడం వల్ల కలిగే లాభాలేంటి..?

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు..అలాగే దర్శకులు కూడా వాళ్ల సినిమాలతో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ని సంపాదించుకుంటారు...

Written By: Gopi, Updated On : September 10, 2024 1:02 pm

Devara(8)

Follow us on

Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మొదటగా మనకు ‘నందమూరి ఫ్యామిలీ’ గుర్తుకొస్తుంది. ‘నందమూరి తారక రామారావు’ గారి దగ్గర నుంచి ‘జూనియర్ ఎన్టీఆర్’ వరకు ప్రతి ఒక్కరు వాళ్ల ప్రతిభను చూపిస్తూ స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్లే కావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ‘కొరటాల శివ’ సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది. ఆయన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో ఒక మెసేజ్ ని ఇస్తూ వచ్చాడు. మరి దేవర సినిమాలో ఎలాంటి మెసేజ్ ను ఇస్తున్నాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొరటాల శివ సినిమాని స్టార్ట్ చేసినప్పుడే సినిమాకు సంబంధించిన స్టోరీని టివిల్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా వెళ్తున్నాడు. మరి దీనికి గల కారణం ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి ఒక సినిమా స్టోరీని కనక జనాల్లోకి తీసుకెళ్తే ఆ స్టోరీ కి ప్రేక్షకులు స్టిక్ అయి ఉంటారు. కాబట్టి ఆ సినిమాలని చూడడానికి వాళ్ళు సైకలాజికల్ గా ఫిక్స్ అవుతారు. ఆ స్టోరీని మైండ్ లో సెట్ చేసుకొని పెట్టుకుంటారు. దీనివల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి సినిమా స్టోరీ ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళ అంచనాలనేవి తారాస్థాయిలో ఉండకుండా సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తారు.

దీని వల్ల సినిమా ఆవరేజ్ గా ఉన్నా కూడా దానికి హిట్ టాక్ అయితే వస్తుంది. అలా కాకుండా సినిమా స్టోరీ రివిల్ చేయకుండా, సినిమాలో ఏదో ఉంది అనే సస్పెన్స్ ని క్రియేట్ చేసి తీరా సినిమా థియేటర్ కి వెళ్ళిన తర్వాత ప్రేక్షకుడి అంచనాలను అందుకునే విధంగా సినిమా లేకపోతే మాత్రం సినిమా బొక్క బోర్లా పడుతుంది. అందువల్లే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ముందుగానే సినిమా స్టోరీని చెప్పేసి ప్రేక్షకుల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు.

ఇక కొరటాలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఎందుకు ‘దేవర ‘ సినిమా రివిల్ చేయడం లేదనే విషయం మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. మరి ఇవాళ్ళ వచ్చే ట్రైలర్ లో అయిన స్టొరీ ని రివిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది… చూడాలి మరి కొరటాల ట్రైలర్ లో ఏం చూపిస్తాడు అనేది…