https://oktelugu.com/

Koratala Siva: ‘ఆచార్య’ ఫ్లాప్ పై చిరంజీవి నాకు అలాంటి మెసేజ్ పెట్టాడు అంటూ సంచలన నిజాలు బయటపెట్టిన కొరటాల శివ!

ఎన్టీఆర్ తో పాటుగా డైరెక్టర్ కొరటాల శివ కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే కొరటాల గత చిత్రం 'ఆచార్య' ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ ఫ్లాప్ చిరంజీవి, కొరటాల శివ మధ్య చాలా గ్యాప్ వచ్చింది, చిరంజీవి చెప్పిన మార్పులు చేర్పులు చేయకపోవడం వల్లే ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ వచ్చిందని సోషల్ మీడియా లో ఒక రూమర్ తెగ ప్రచారం అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 24, 2024 / 03:59 PM IST

    Koratala Siva

    Follow us on

    Koratala Siva: మరో మూడు రోజుల్లో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో నెల రోజుల ముందే ప్రారంభం అవ్వగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుండి ప్రారంభం అయ్యింది. ఓవర్సీస్ లో ఎలా అయితే రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ని నమోదు చేస్తూ కేవలం ప్రీమియర్ షోస్ నుండే 2 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టిందో, ఇక్కడ కూడా అదే స్థాయి డిమాండ్ ఉంది. బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేక్స్ లాగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం లిమిటెడ్ షోస్ ని మాత్రమే ప్రారంభించారు, వీటి నుండే ఇండియా వైడ్ గా ఈ సినిమాకి నిన్నటితో 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో గంటకు పాతిక వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ తో పాటుగా డైరెక్టర్ కొరటాల శివ కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే కొరటాల గత చిత్రం ‘ఆచార్య’ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ ఫ్లాప్ చిరంజీవి, కొరటాల శివ మధ్య చాలా గ్యాప్ వచ్చింది, చిరంజీవి చెప్పిన మార్పులు చేర్పులు చేయకపోవడం వల్లే ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ వచ్చిందని సోషల్ మీడియా లో ఒక రూమర్ తెగ ప్రచారం అయ్యింది. చిరంజీవి కూడా పలు సందర్భాలలో డైరెక్టర్స్ మాకు ఏదైనా బాగుంది అనిపిస్తే చెప్తాము, వాటిని పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా మీరేంటి నాకు చెప్పేది అనే ధోరణి తో వెళ్తే ఫ్లాప్స్ వస్తాయి అంటూ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ ఒక మీడియా వర్గం అది కొరటాల శివ ని అన్నట్టుగా ప్రేరేపించాయి.

    దీనిపై కొరటాల శివ స్పందిస్తూ ‘ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యినప్పుడు నాకు మొట్టమొదట చిరంజీవి గారి నుండే మెసేజి వచ్చింది. అధైర్య పడకు, నువ్వు మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలి అని చెప్పాడు. నేను ఆర్థికంగా ఆ సమయంలో పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయినప్పుడు కూడా ఆయన నాకు అండగా నిలబడ్డాడు. కొన్ని మీడియా చానెల్స్ చిరంజీవి గారు మాట్లాడిన మాటలను వక్రీకరించి జనాల్లోకి తీసుకెళ్లాయి. కానీ ఆయనతో నాకు ఇప్పటికీ ఎంతో మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి’ అంటూ కామెంట్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఈ అంశం పై చిరంజీవి గారిని చెడుగా చేసి చూపించిన వాళ్లంతా ఎటుపోయారు అంటూ కొరటాల శివ చేసిన కామెంట్స్ ని షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు. మొత్తానికి గత కొంతకాలం గా ప్రచారం అవుతున్న ఒక రూమర్ కి ఎట్టకేలకు నేటితో తెరపడింది.