Koratala Siva: దర్శకుడు కొరటాల ఐదేళ్ళ క్రితమే చిన్న సినిమాలకు సమర్పకుడిగా మారాలని, అలాగే వినూత్న సినిమాలకు నిర్మాతగా ఎదగాలని బాగా ఉబలాట పడ్డాడు. కానీ కొరటాలకు టైం దొరలేదు. తాను నిర్మాతగా మారడానికి మధ్యలో ఓ కథ అనుకున్నా.. దాన్ని పట్టాలెక్కించలేకపోయాడు. అంతలో కరోనా వచ్చింది. చేస్తున్న ఆచార్యకి మధ్యలోనే బ్రేక్ పడింది. ఇక సెకెండ్ వేవ్ అనంతరం ఆచార్య పనుల్లో కొరటాల ఫుల్ బిజీ అయిపోయాడు.

అయితే, ఎట్టకేలకు ప్రస్తుతం తన నిర్మాణంలో రాబోతున్న ఓ చిన్న సినిమాకి సమయాన్ని కేటాయించాడు. సినిమాలో బాగానే మ్యాటర్ ఉంది అంటున్నారు. పైగా కొరటాల ఈ చిన్న సినిమాకు మాటలు కూడా రాస్తున్నాడు. కాకపోతే కథ కొత్త రచయితది. కాగా, కొరటాల నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో అంతో ఇంతో భాగస్వామిగా ఉండాలని యువీ వంశీ కూడా ఆలోచిస్తున్నాడు.
కానీ, యువీ వంశీ ఎంటర్ అయితే, మళ్ళీ పెద్ద సినిమాగా తయారవుతుందేమో అని కొరటాల భయం. అందుకే, సోలో నిర్మాతగానే ఈ సినిమాను తీయబోతున్నాడు. గోపాల్ కృష్ణ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. యంగ్ హీరో ఆదిత్య అరుణ్ హీరోగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.
ఇదొక ముదురు భామ లవ్ స్టోరీ అట. కథలో ఎమోషన్స్ చాలా బాగుంటాయని, అలాగే మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా సినిమాలో ఉండబోతుందని తెలుస్తోంది. అన్నిటికీ మించి ఈ సినిమాకు కొరటాల శివ నిర్మాత. అలాగే మాటల రచయిత కూడా. ఇది చాలదా ? జనం ఈ సినిమా పై అంచనాలను పెంచేసుకోవడనికి. అయితే, కొరటాలను మాత్రం ఒక విషయంలో అభినందించాలి.
Also Read: Tollywood News: పాతికేళ్ళ హీరో కంటే.. పదేళ్ళు విలన్ కే ఎక్కువ సంపాదన !
ఆదిత్య అరుణ్ హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ మంచి యాక్టర్. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా మంచి నటి. కానీ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. అయినప్పటికీ కొరటాల టాలెంట్ ను తప్ప, స్టార్ డమ్ ను చూడకుండా వీళ్లకు అవకాశం ఇచ్చి మరీ సినిమా చేస్తుండటం విశేషం. మొత్తానికి నిర్మాత కావాలనే కొరటాల కల నెరవేరబోతోంది.
Also Read: Pushpa: శరవేగంగా పుష్ప షూటింగ్.. నెట్టింట్లో బన్నీ లుక్స్ వైరల్!