AP BJP: బీజేపీ 2024 ఎన్నికలే లక్ష్యంగా కదులుతోంది. ఇందుకు సంబంధించిన వ్యూహాలు ఖరారు చేస్తోంది. దేశంలో బీజేపీని బలోపేతం చేయడం అహర్నిశలు శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల తిరుపతి సమావేశానికి విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు పని చేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చినట్లయింది.

వచ్చే ఏడాది జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల్లో కూడా బీజేపీ తన ప్రభావం చూపించి దక్షిణాదిన కూడా పట్టు సాధించాలని తాపత్రయపడుతోంది. ఇందుకుగాను పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో వచ్చిన మెజార్టీ చూసి కమలదళంలో దూకుడు పెరిగినట్లు కనిపిస్తోంది. గతంలో కూడా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయదళం అధికార పార్టీ టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించింది. దీంతో అదే ఊపుతో తెలుగు ప్రాంతాలను కూడా తమ అధికారంలోకి తీసుకురావాలని నేతలు పావులు కదుపుతున్నారు.
అమిత్ షా తిరుపతి పర్యటనలో భాగంగా బీజేపీ నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. పార్టీ అవలంభించబోయే కార్యక్రమాలపై ఓ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే పొత్తులపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో పొత్తు ఉంటే ఎవరితో ఉంటుందనే దానిపై ఇప్పటికి కూడా ఓ అవగాహనకు రాలేకపోతున్నారు. దీంతో భవిష్యత్ లో జనసేనతో పొత్తు ఉంటుందా? లేక టీడీపీతోనా అనే దానిపై ఇంకా ఏ రకమైన నిర్దేశం కానరావడం లేదు.
ఏపీలో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతలను ఆకర్ష్ తో బీజేపీలోకి తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం. దీంతో రాష్ర్ట నేతలు ఇతర పార్టీల నేతలపై దృష్టి సారిస్తున్నారు. వారికి తాయిలాలు ప్రకటించి తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. ఇదంతా రాబోయే ఎన్నికల కోసమే అని తెలుస్తోంది.
రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీలో ఓటింగ్ శాతం పెరిగినట్టు గుర్తించారు. దీంతో రాష్ర్టంలో బీజేపీ బలపడాలంటే చేపట్టాల్సిన చర్యలపై కూడా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి అధిష్టానం సూచనల మేరకు పార్టీ నిర్ణయాలు ఉంటాయని చెప్పడం తెలిసిందే దీంతో రాష్ర్టంలో బీజేపీ ఉనికిని పెంచేందుకు నేతలు చేపట్టాల్సిన చర్యలపై కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. బీజేపీ బలపడితే టీడీపీకి కూడా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీ బలోపేతంపై టీడీపీకి కూడా ఆశలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Jagan Pawan: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. దెబ్బకు ‘రోడ్డు’పై పడ్డ జగన్
హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించడంపై కూడా చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ మంచి ఊపులో ఉందని నేతలు చెప్పారు. ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై కూడా దృష్టి సారించినట్లు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలుగు స్టేట్లలో అధికారం చేపట్టేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: TS Politics TRS vs BJP: తెలంగాణ లో రాజకీయాలు బీజేపీ vs టీఆర్ఎస్