Koratala Siva Market Value: కెరియర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లను అందుకున్న దర్శకుడు కొరటాల శివ… మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అనే మూవీస్ తో ఇండస్ట్రీ ని షేక్ చేశాడు. ఎప్పుడైతే ఆయన చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేశాడో అప్పటినుంచే ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆచార్య మూవీ చేయడం వల్ల తను చాలా వరకు నష్టపోయాడు…తన మార్కు ను చూపించకుండా కొరటాల శివ అన్ని చోట్ల కాంప్రమైజ్ అయి తన సినిమాను చేశారంటూ చాలామంది చెబుతూ ఉంటారు. చిరంజీవి చెప్పినట్టుగా కథను మార్చరనే వార్తలు కూడా వచ్చాయి. దానివల్ల ఈ సినిమా ప్లాప్ అయిందని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే ఆచార్య నుంచి కోలుకోవడానికి ఆయన దేవర సినిమా చేశాడు.
ఈ మూవీ కేవలం యావరేజ్ టాక్ ను సంపాదించుకుందే తప్ప బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలవలేకపోయింది. దాంతో ఆయన చాలావరకు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘దేవర 2’ సినిమా కూడా క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు ఆయన మీడియం రేంజ్ హీరోతో ఒక సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక తను అనుకున్నట్టుగానే ఇప్పుడు రాబోయే సినిమాలతో కనుక విజయాన్ని సాధించి మరోసారి తన సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఆచార్య సినిమా చేయడం వల్ల అతని మార్కెట్ పూర్తిగా పడిపోయిందని చెప్పేవారు సైతం చాలా మంది ఉన్నారు… ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక మహేష్ బాబుతో రెండు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లో అందుకున్న కొరటాల మరోసారి మహేష్ బాబుతో జతకడతాడా అనేది తను ఇప్పుడు చేస్తున్న సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉందనే చెప్పాలి… మొత్తానికైతే కొరటాల శివ మరోసారి టైర్ వన్ హీరోలతో సినిమాలు చేయాలంటే మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది…