Koratala Siva: వరుస హిట్స్ తో దూసుకుపోతూ ముందుకెళ్లిన కొరటాల శివ కి ఈ ఏడాది అతని దర్శకత్వం లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం బ్రేక్ వేసింది..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..అయితే చిరంజీవి ఆచార్య ఫ్లాప్ నుండి మెగాస్టార్ త్వరగానే కోలుకొని గాడ్ ఫాదర్ వంటి డీసెంట్ హిట్ తో గాడిలోపడ్డాడు..కానీ కొరటాల శివ మాత్రం ఇంకా నిరాశలోనే ఉన్నాడు.

ఈ సినిమాకి కొరటాల కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు..బిజినెస్ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టాడు..దాని పరిణామం చివరికి ఏ రేంజ్ దాకా తీసుకెళ్ళిందో అందరికి తెలిసిందే..డిస్ట్రిబ్యూటర్స్ తాకిడి నుండి ఆయన ఇప్పటికి పూర్తిగా తేరుకోలేదు..అందుకే ఆచార్య సినిమా విడుదలైన తర్వాత కొరటాల శివ మీడియా ముందుకు రావడానికి సాహసించడం లేదు..రీసెంట్ గా ఆయన ఒక ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరు కావాల్సి ఉంది.
ప్రముఖ దర్శకుడు దశరధ్ ‘లవ్ యు రామ్’ అనే సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నాడు..ఈ సినిమా ప్రారంభోత్సవానికి మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో పాటుగా కొరటాల ని కూడా ఆహ్వానించాడు దశరధ్..కొరటాల ముందుగా రావడానికి ఒప్పుకున్నాడు..కానీ మీడియా సమావేశం కూడా ఉంది అనే సమాచారం కొరటాల శివ కి తెలియడం తో చివరి నిమిషం లో ఆయన ‘నేను రావట్లేదు..క్షమించండి’ అంటూ దశరధ్ కి మెసేజి పెట్టాడట..ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..మీడియా సమావేశం లో కూర్చుంటే కచ్చితంగా ఆచార్య సినిమా గురించి ప్రశ్నలు అడుగుతారు..వాటిని ఎదుర్కొనే ధైర్యం లేకనే కొరటాల శివ ఈ ఫంక్షన్ కి డుమ్మా కొట్టినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త.

సినిమా అన్నాక హిట్ / ఫ్లాప్ అనేది సర్వసాధారణం..ఒక్క ఫ్లాప్ కి ఇలా అయిపోతే ఎలా అని కొరటాల శివ కి ఆయన సన్నిహితులు ధైర్యం చెప్తున్నారు..ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.