క్రియేటివ్ పర్సన్స్ కి ఉండే సమస్య బట్టతల. కాస్త ఆలోచనలతో సతమతమయ్యేవారికి ఈ రోజుల్లో బట్టతల అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు కొరటాల శివకి కూడా బట్టతల ఉంది. పైగా కొరటాల బట్టతల ఇబ్బంది కరంగా కూడా ఉంటుంది. అయినా తన అందం గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు.
కథల పై ఉన్న ఇంట్రెస్ట్ లుక్ పై లేదు. దాంతో ఎప్పుడో అవకాశం ఉన్నా.. ఆయన బట్టతలను అలాగే వదిలేశారు. అయితే, ఆయన భార్య పట్టుబట్టడంతో ఆయన ఏడు నెలల క్రితం హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. దాంతో ఇప్పుడు కొరటాల లుక్ పూర్తిగా మారిపోయింది. నిన్న కొరటాల పుట్టిన రోజు. ఈ సందర్భంగా విడుదలైన ఫోటోలలో కొరటాల చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.
ఆయన పాత ఫోటోలకు, నిన్నటి కొత్త ఫోటోలకు ‘తేడా’ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ‘సైడ్’లు ఇప్పుడు జుత్తుతో బాగా కవరయ్యాయి. నిండుగా ఉంది కొరటాల హెయిర్ స్టైల్. మొత్తానికి కొరటాల కొత్త లుక్ ని చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న తర్వాత కొరటాల చాలా యంగ్ లుక్ లోకి మారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ‘ఆచార్య’ దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి తెలిపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిరు తనలోని కవితాత్మకతకు పని చెప్పి పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంతకీ చిరు ఏం పోస్ట్ పెట్టారు అంటే “ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది’ అంటూ చిరు ట్వీట్ చేశారు. మొత్తానికి చిరు కొరటాలను బాగా వర్ణించాడు.