https://oktelugu.com/

Devara: దేవర ఇంట్రడక్షన్ సీన్ కి క్లైమాక్స్ కి మధ్య ఒక పెద్ద లింక్ సెట్ చేసిన కొరటాల…ఇది మామూలుగా లేదుగా…

కొరటాల శివ గతంలో చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లని సాధించాయి. ఇక ఆచార్య తో ఆయన కొంతవరకు డీలాపడ్డ విషయం మనకు తెలిసిందే. చిరంజీవి తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని సక్సెస్ ఫుల్ గా మలచడంలో కొరటాల మాత్రం ఫెయిల్ అయ్యారు. ఇక ప్రాబ్లం ఏదైనా కూడా మొత్తానికైతే ఆచార్య ను డిజాస్టర్ చేయడంతో ఒక్కసారిగా కొరటాల ఇమేజ్ అయితే డ్యామేజ్ అయిపోయిందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : September 12, 2024 / 12:31 PM IST

    Devara(8)

    Follow us on

    Devara: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో డైరెక్టర్లు చాలావరకు సక్సెస్ అవుతూ వస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవాలి అంటే మాత్రం దర్శకులు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి చేస్తున్న ‘దేవర ‘ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసమే ఈ సినిమాని ఎలాగైనా సరే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ చేయాలని తద్వారా జూనియర్ ఎన్టీఆర్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కొరటాల శివ చాలా వరకు తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఇక అందులో భాగంగానే ఈ సినిమా కోసం తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ఎత్తున సీజీ షాట్స్ ని డిజైన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది…ఇక ఇలాంటి కొరటాల శివ దేవర సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ కి అలాగే క్లైమాక్స్ సీన్ కి మధ్య ఇంటర్ లింక్ అయితే రాసుకున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక దేవర సినిమా యూనిట్ నుంచే ఇలాంటి ఒక లీకేజ్ అయితే బయటికి వస్తుంది.

    ఇక రీసెంట్ గా సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందించడంతో ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇంట్రాడక్షన్ సీన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సినిమాని కూడా అక్కడే ముగించే విధంగా స్క్రీన్ ప్లే ని చాలా టైట్ గా రాసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి వైవిధ్యభరితమైన ట్రిక్స్ ని వాడితేనే సినిమా అనేది సూపర్ సక్సెస్ గా నిలుస్తుందని కొరటాల శివ భావించినట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇలాంటి కొన్ని ట్రిక్స్ ని వాడుతూ కొరటాల సినిమాను ఔట్ ఆఫ్ ది బాక్స్ గా నిలపాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టడం పక్క అంటూ కొరటాల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఇటు ఎన్టీయార్ కి, అటు కొరటాల కి ఎలాంటి సక్సెస్ ని సాధించి పెడుతుంది అనేది…