https://oktelugu.com/

Venkat Prabhu: నాగ చైతన్య వల్లే సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా ప్లాప్ అయింది అంటున్న తమిళ్ స్టార్ డైరెక్టర్…

ఇక సినిమా సక్సెస్ అవ్వాలంటే చాలా మంది వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందులో ఏ ఒక్కరూ వాళ్ల పనిని సక్రమంగా చేయకపోయిన సినిమా ప్లాప్ అవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 12, 2024 / 12:28 PM IST

    Venkat Prabhu(1)

    Follow us on

    Venkat Prabhu: తెలుగు సినిమా ఇండస్ట్రీ అక్కినేని ఫ్యామిలీకి సపరేట్ క్రేజ్ అయితే ఉంది. మూడు తరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తూ వస్తున్న ఈ స్టార్ హీరోలు తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇక నాగేశ్వరరావు తర్వాత నాగార్జున అయిన తర్వాత నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య చేసిన కస్టడీ సినిమా ఆశించిన మెరకు ప్రేక్షకులను అలరించలేదు. నిజానికైతే వెంకట్ ప్రభు ఈ సినిమాను ఎందుకు తీశాడో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఈ సినిమా ఆధ్యాంతం ఎక్కడ కూడా ఒక హై ఫీల్ లేకుండా చాలా లో ప్లాట్ పాయింట్ తో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాని నాగచైతన్య చేసి చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ అతని అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురయ్యారు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన వెంకట్ ప్రభు ప్రస్తుతం విజయ్ తో చేసిన గోట్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక రీసెంట్ గా వెంకట్ ప్రభు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక అందులో భాగంగానే నాగచైతన్య చేసిన కస్టడీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తనకి సంబంధం లేదని అందులో హీరో ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవ్వడం వల్లే సినిమా ఫ్లాప్ అయింది అంటూ తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనాన్ని రెకెత్తిస్తున్నాయి.

    నిజానికి నాగచైతన్య ఇప్పటి వరకు తను చేసే సినిమాల స్క్రిప్ట్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడు అంటూ చాలామంది దర్శకులు చెబుతూ వస్తున్నారు. కానీ వెంకట్ ప్రభు మాత్రం దానికి భిన్నంగా నాగచైతన్య వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ చెప్పడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే వెంకట్ ప్రభు శింబు తో చేసిన ‘మానాడు ‘ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెంకట్ ప్రభు కి నాగచైతన్య సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు.

    కానీ వెంకట్ ప్రభు నాగచైతన్య మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. ఇక కస్టడీ సినిమా విషయం పక్కనపెడితే మరి గోట్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటూ వెంకట్ ప్రభు మీద అక్కినేని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. విజయ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది అందుకే గోట్ ప్లాప్ అయింది అని చెప్పే దమ్ము వెంకట్ ప్రభు కు ఉందా అంటు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమా సరిగ్గా చేయకపోవడం వల్ల గోట్ సినిమా ప్లాప్ అయింది. అంతే తప్ప హీరోల వల్ల కాదు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర స్థాయిలో తన మీద విరుచుకుపడుతున్నారు…