https://oktelugu.com/

RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి మరో బిగ్ అప్డేట్… కొమరం భీమ్ ప్రోమో రిలీజ్

RRR Movie: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా… ప్రపంచ వ్యాప్తంగా అంద‌రూ ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా.. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తారక్ జోడీగా హాలీవుడ్ హీరోయిన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 01:28 PM IST
    Follow us on

    RRR Movie: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా… ప్రపంచ వ్యాప్తంగా అంద‌రూ ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా.. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తారక్ జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుకు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ తరుణంలో మూవీ ప్రముషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర బృందం.

    RRR Movie

    Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ నుంచి “అలియా భట్” మేకింగ్ వీడియో ఔట్…

    ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. కొమరం భీమ్ ప్రోమో ను మూవీ యూనిట్ విడుద‌ల చేసింది. ఈ ప్రోమో లో జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎన‌ర్జీటిక్ గా క‌నిపించాడు. నీళ్ల‌ల్లో ఉన్న ఎన్టీఆర్… ఎంతో ఆక్రోశంతో ఉన్న‌ట్లు మ‌న‌కు క‌నిపించాడు. కాగా రేపు ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. కాగా ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్… అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ప్రోమోతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Also Read: ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​పై పెరుగుతున్న అంచనాలు.. ​ఆకట్టుకుంటున్న న్యూ పోస్ట్​