https://oktelugu.com/

Akhanda Movie: 100 కోట్లు మార్క్ దిశగా పరుగులు తీస్తున్న బాలయ్య “అఖండ”…

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం “అఖండ” . ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. టాలీవుడ్లో ‘అఖండ’ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డులపై కన్నేసింది. బాలయ్య కెరీర్లోనే అత్యంత వేగంగా రూ.50 కోట్లు కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా ‘అఖండ’ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్రేడ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 01:15 PM IST
    Follow us on

    Akhanda Movie: నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం “అఖండ” . ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. టాలీవుడ్లో ‘అఖండ’ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డులపై కన్నేసింది. బాలయ్య కెరీర్లోనే అత్యంత వేగంగా రూ.50 కోట్లు కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా ‘అఖండ’ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్రేడ్ వర్గాలను సైతం షాక్ చేసేలా అఖండ ప్రభంజనం సాగుతుంది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇస్తుంది ఈ మూవీ.

    అఖండ సినిమా 6 రోజుల్లోనే 85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన 6వ రోజు కూడా 3 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ. బాలయ్య స్టార్ట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతర చూపిస్తున్నాడు. బాలయ్య గత సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్‌లో కూడా కనీసం 10 కోట్లు షేర్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అఖండ 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 51. 82 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా 6 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..

    నైజాం: 14.33 కోట్లు
    సీడెడ్: 11.38 కోట్లు
    ఉత్తరాంధ్ర: 4.38 కోట్లు
    ఈస్ట్: 3.00 కోట్లు
    వెస్ట్: 2.36 కోట్లు
    గుంటూరు: 3.65 కోట్లు
    కృష్ణా: 2.65 కోట్లు
    నెల్లూరు: 1.92 కోట్లు

    ఏపీ-తెలంగాణ టోటల్: 43.67 కోట్లు (68.80 కోట్లు గ్రాస్)
    కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 3.65 కోట్లు
    ఓవర్సీస్: 4.50 కోట్లు
    టోటల్ వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్: 51.82 కోట్లు (84.85 కోట్లు గ్రాస్)