Vastu Tips: వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఈ తప్పులు చేస్తే… సమస్యలు తప్పవు!

Vastu Tips Telugu : సాధారణంగా ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే వారి చేసే ప్రతి చిన్న విషయంలోనూ వాస్తును పరిశీలించి ఆ పనులను ప్రారంభిస్తారు.ఇంటి నిర్మాణం చేపట్టే విషయం నుంచి ఇంట్లో అలంకరించుకునే ప్రతి ఒక్క విషయం వరకు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఇంట్లో వస్తువులను కూడా అలంకరించుకుంటారు. మన ఇంట్లో ఏవైనా వాస్తుకు విరుద్ధంగా ఉన్న లేకపోతే కొన్ని రకాల తప్పులు జరిగిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. […]

Written By: Kusuma Aggunna, Updated On : December 8, 2021 3:32 pm
Follow us on

Vastu Tips Telugu : సాధారణంగా ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే వారి చేసే ప్రతి చిన్న విషయంలోనూ వాస్తును పరిశీలించి ఆ పనులను ప్రారంభిస్తారు.ఇంటి నిర్మాణం చేపట్టే విషయం నుంచి ఇంట్లో అలంకరించుకునే ప్రతి ఒక్క విషయం వరకు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఇంట్లో వస్తువులను కూడా అలంకరించుకుంటారు. మన ఇంట్లో ఏవైనా వాస్తుకు విరుద్ధంగా ఉన్న లేకపోతే కొన్ని రకాల తప్పులు జరిగిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఇంట్లో కొన్ని రకాల తప్పులను చేయకూడదు. మరి ఆ పొరపాట్లు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Vastu Tips

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపించి అనేక సమస్యలు గొడవలకు కారణమవుతాయి.అలాగే మన ఇంట్లో పరిశుభ్రత లేకపోవడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో విరిగిపోయిన ఫర్నిచర్ ను అసలు పెట్టుకోకూడదు. ఇలాంటి ఫర్నిచర్ ఇంటిలో ఉండటం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి.

Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో శివుడి ఫోటోలు ఉంటే పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి!

సాధారణంగా కొందరు కొన్ని రకాల పక్షులను పెంచుకుంటూ ఉంటారు. అయితే అది ఉండటానికి గూడు నిర్మించుకుంటూ ఉంటాయి. అలా పావురాలు మన ఇంటిలో గూడు నిర్మించుకోవడం ఎంతో అశుభంగా పరిగణిస్తారు. చాలామంది ఇంటిలో పనికిరాని గడియారం లేదా చెడిపోయిన గడియారాన్ని ఒక అలంకరణ వస్తువుగా పెట్టుకుంటారు. ఇలా విరిగిపోయిన చెడిపోయిన గడియారం ఇంటిలో ఉండటం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. మన ఇల్లు మొత్తం నెగిటివ్ ఎనర్జీ వ్యాపించి ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధమైనటువంటి తప్పులు చేయకపోవటం ఎంతో మంచిది.

Also Read: నెలకు రూ.5,000 కడితే కొత్త కారు మీ సొంతం.. ఏ విధంగా అంటే?