Kiskindhapuri Movie First Week Collection: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి'(Kiskindhapuri Movie) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ వసూళ్లను చూసి మళ్లీ బెల్లంకొండ కి ఫ్లాప్ తప్పేలా లేదని విశ్లేషకులు అనుకున్నారు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ బాగా వ్యాప్తి చెందడం తో ఈ సినిమాకు స్టడీ రన్ సొంతమైంది. ఫలితంగా నేటితో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని పూర్తి గా అందుకొని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో చాలా కాలం తర్వాత ఒక మంచి సూపర్ హిట్ చిత్రంగా నిల్చింది. విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారంలో 3 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 69 లక్షలు , ఆంధ్రా ప్రాంతం లో 3 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 8 కోట్ల 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 14 కోట్ల 50 లక్షల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి 18 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు,9 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 10 కోట్ల రూపాయలకు జరిగింది. ఇక కేవలం 17 లక్షల రూపాయిల గ్రాస్ షేర్ వసూళ్లు వస్తే హిట్ ఐపోయినట్టే. అది నేటి మ్యాట్నీ షోస్ కే దాటేసిందని, బెల్లంకొండ కెరీర్ లో క్లీన్ హిట్ గా నిలిచిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత దూరం వెళ్లి ఆగుతుంది చూడాలి. ఎంత వచ్చినా సెప్టెంబర్ 25 వరకే రావాలి, ఆ తర్వాత ఓజీ చిత్రం వస్తుంది కాబట్టి, థియేటర్స్ నుండి ఈ సినిమాని తీసి వేయాల్సి వస్తుంది. ఓజీ కి ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా ఆగిపోయినట్టే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.