Little Hearts 2 Week Collection: చిన్న సినిమాగా అతి తక్కువ థియేటర్స్ లో విడుదలై, ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. మౌళి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన మౌళి హీరో గా నటించిన మొట్టమొదటి ఫీచర్ చిత్రమిది. సెప్టెంబర్ 12 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని నిర్మాత ధైర్యం చేసి సెప్టెంబర్ 5 న విడుదల చేయడమే కాకుండా, ఒక రోజు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ కూడా వేసాడు. ఒక సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు చెప్పండి. ఆ నమ్మకమే నిజమైంది ప్రీమియర్ షోస్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడం తో, మొదటి రోజు ఈ చిత్రానికి క్యూలు కట్టేశారు ఆడియన్స్. అలా రెండు వారాల నుండి థియేటర్స్ లో స్టడీ రన్ ని సొంతం చేసుకుంటూ వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ప్రాంతాల వారీగా చూస్తే ఈ చిత్రానికి కేవలం నైజాం ప్రాంతం నుండే 6 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రానికి ఈ రేంజ్ షేర్ వసూళ్లు ఒక ప్రాంతం నుండి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇక ఆ తర్వాత సీడెడ్ ప్రాంతం నుండి కోటి 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రాంతం నుండి 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 13 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలు కాకుండా,కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలకు కలుపుకొని ఈ సినిమాకు 5 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 18 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా విడుదలైన పక్క వారం లోనే మిరాయ్ చిత్రం విడుదల అవ్వడం, అది కూడా పెద్ద హిట్ అవ్వడం వల్ల ఈ సినిమాపై కాస్త ప్రభావం పడిన విషయం వాస్తవమే కానీ, వేరే రిలీజ్ డేట్ లో వచ్చి ఉండుంటే మాత్రం, కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చి ఉండేవని అంటున్నారు ట్రేడ్ పండితులు.