Kishkindhapuri Trailer Review: తెలుగులో హర్రర్ సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే హర్రర్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఒక్కసారి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం చాలా మంది ఆ సినిమాను చూస్తూ భయపడుతూ ఆ భయాన్ని కూడా ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు. కానీ సక్సెస్ ఫుల్ టాక్ రాకపోతే మాత్రం అసలెవరు ఆ సినిమాలను పట్టించుకోరు. మరి ఇలాంటి క్రమంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వస్తున్న ‘కిష్కిందపురి’ సినిమా హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. మరి ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కొద్దిసేపటికి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఈ టైలర్ ను బట్టి చూస్తే క్యూరియాసిటీ తో ఉన్న కొంతమందిని ఏకం చేసి దెయ్యం ఉన్న ఒక బిల్డింగ్ లో వేసి ఒక గేమ్ షో లాగా దాన్ని డిజైన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి దానికి తగ్గట్టుగానే అక్కడ నిజంగానే దయ్యం ఉందా? లేదా అనే హార్రర్ ఎలిమెంట్స్ తో సినిమా మొత్తం నడవబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ బిల్డింగ్ లో ఒక దయ్యం అయితే ఉందని ఆత్మగా మారి తన కోర్కెలను తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆ దెయ్యం బారిన ఎలా పడింది? హీరో తనని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ గా చెప్పొచ్చు… హర్రర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అలాగే దానికి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా బాగా సెట్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ కూడా బాగుంది ట్రైలర్ లో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెప్పించింది.
మొత్తానికైతే ఈ సినిమాలో హార్రర్ ఒకటే ఎలివేట్ చేస్తూ ట్రైలర్ కట్ అయితే ఇచ్చారు. మరి సినిమా మొత్తంలో హార్రర్ ఒకటే బేస్ అయ్యి ఉంటే సినిమా ఆడదు. దానికి తగ్గట్టుగా హార్రర్ తోపాటు కామెడీ అయిన ఉండాలి, లేదంటే హారర్ తో పాటు ఎమోషన్ అయిన పర్ఫెక్ట్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే సినిమా సగటు ప్రేక్షకుడికి నచ్చుతోంది. అలాగే హార్రర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి…
ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే ఇందులో అటు కామెడీ, ఇటు ఎమోషన్ రెండు మైనస్ గా మారబోతున్నాయనే విషయమైతే అర్థమవుతోంది. మరి ఇందులో ఏ ఒక్కటి పర్ఫెక్ట్ ఎలివేట్ అయిన కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది…