Kishkindhapuri 3 days Collections: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి'(KishkindhaPuri Movie) రీసెంట్ గానే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. ఈమధ్య కాలం లో సరైన హారర్ థ్రిల్లర్ జానర్ సినిమా రాలేదు. 2023 లో విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త హారర్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఈ జానర్ మీద పెద్దగా సినిమాలు రాలేదు. వచ్చినా కూడా అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ‘కిష్కింధపురి’ మాత్రం ఆడియన్స్ ని నిజంగానే సర్ప్రైజ్ కి గురి చేసింది. మొదటి రోజు ఈ సినిమా తో పాటు ‘మిరాయ్’ చిత్రం కూడా విడుదల అవ్వడం, ఆ సినిమాకు భారీ అంచనాలు ఉండడంతో పాటు, మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం ఈ సినిమా కలెక్షన్స్ పై కాస్త పడడం వల్ల ఓపెనింగ్ వసూళ్లు అనుకున్నంత రేంజ్ లో రాలేదు.
కానీ పాజిటివ్ మౌత్ టాక్ ఉండడం వల్ల ఈ సినిమా రెండవ రోజు నుండి బాగా పుంజుకుంది. మొదటి రోజు కంటే అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలా మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి అతి చేరువలో ఉంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 10 కోట్ల రూపాయలకు జరిగిందట. మొదటి రోజున ప్రీమియర్ షోస్ తో కలిపి కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు కోటి 82 లక్షలు, మూడవ రోజు 2 కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా మూడు రోజులకు ఈ చిత్రం 5 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 9 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 40 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 32 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విడగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 6 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవాలంటే ఇక కేవలం మూడు కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లనే రాబట్టాలి. బుక్ మై షో యాప్ లో మూడవ రోజున గంటకు నాలుగు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మ్యాట్నీ షోస్ బాగా పికప్ అయ్యింది. ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ ఇంకా భారీ రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటి వారం లోపే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునేలా ఉంది ఈ చిత్రం.