కీర్తి సురేశ్ మహానటి కాదు.. మహానాటు అట

మహానటితో సౌత్ ఇండస్ట్రీలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ‘కీర్తి సురేష్’. ఈ అరవిరిసిన పుష్పంలా నవ్వుతూ ఉండే కీర్తి ఈ మధ్య కొన్ని క్రైం తరహా చిత్రాలతో వెబ్ సిరీస్ లు చేసింది. కరోనా టైంలో వెళ్లదీసింది. ఆమె స్ట్రెయిట్ సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో అవకాశాలు రావడం లేదు. తాజాగా నితిన్ సరసన కీర్తికి అవకాశం వచ్చింది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  […]

Written By: NARESH, Updated On : March 22, 2021 2:45 pm
Follow us on

మహానటితో సౌత్ ఇండస్ట్రీలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ‘కీర్తి సురేష్’. ఈ అరవిరిసిన పుష్పంలా నవ్వుతూ ఉండే కీర్తి ఈ మధ్య కొన్ని క్రైం తరహా చిత్రాలతో వెబ్ సిరీస్ లు చేసింది. కరోనా టైంలో వెళ్లదీసింది. ఆమె స్ట్రెయిట్ సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో అవకాశాలు రావడం లేదు. తాజాగా నితిన్ సరసన కీర్తికి అవకాశం వచ్చింది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  కీర్తి జోష్ అయిన పాత్రలో నటించింది.  ఈ చిత్రాన్ని 26 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో నితిన్ కొన్నిఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

మొదట ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా వచ్చిన త్రివిక్రమ్ వచ్చారు.. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ త్రివిక్రమ్ తో తీసిన ‘అ..అ..’ సినిమాకు ఇదే శిల్పకళా వేదికకు వచ్చానని… అప్పుడు పవన్ కల్యాణ్ గారు ఉన్నారన్నారు. పవన్ కల్యాన్, త్రివిక్రమ్ నాకు రెండు కళ్లు అని చెప్పారు.

ఇక హీరోయిన్ కీర్తీ సురేశ్ గురించి మాట్లాడుతూ ఆమె పేరు ఎత్తగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ‘మహానటి’. కానీ ఈ సినిమాలో ఆమె ‘మహానాటు’అని అన్నారు.  ‘ఈ సినిమాలో కాలేజీ కుర్రాడిలా నటించాలని చెప్పారు. అయితే నాకు 36 ఏళ్లు.. ఎలా నటించాలని అడిగితే.. మీరింకా చిన్నపిల్లాడే’ అని అన్నారు. పీసీ శ్రీరామ్ డీపీ అనగానే ఈ సినిమాను ఒప్పుకున్నానని, ఇదివరకు ఆయనతో కలిసి ‘ఇష్క్’ చేశానని చెప్పారు. అయితే కాలేజీ కుర్రాడిలా బాగానే నటించానని తెలిపారు.

దేవీశ్రీప్రసాద్ మంచి సంగీతం అందించాడని.. ఆయన పేరు ఎత్తాలంటే మొదట ఓ స్టెప్పు వేసేలా తయారైందని నితిన్ అన్నారు.