ఇటీవల జరిగిన సోషల్ మీడియా చిట్ చాట్‌లో రోజాపై నాగబాబు చేసిన కామెంట్స్ జనాల్లో హాట్ హాట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై మరోసారి రియాక్ట్ అయ్యారు మెగా బ్రదర్. సినిమా సినిమానే.. రాజకీయం రాజకీయమే అంటూ రోజాను కమెడియన్ అని సంబోధించడంపై వివరణ ఇచ్చారు నాగబాబు. జబర్దస్త్ జడ్జీలుగా నాగబాబు-–రోజా కాంబో సుదీర్ఘ ప్రయాణం కొనసాగించిన సంగతి అందరికీ తెలిసిందే. తమపై జబర్దస్త్ కమెడియన్స్ ఎన్ని పంచులేసినా సరదాగా తీసుకుంటూ ఆ షోకి అమితమైన ప్రజాదరణ రావడంలో కీలక భూమిక పోషించారు.
అయితే.. రీసెంట్‌గా మల్లెమాలతో తెగదెంపులు చేసుకొని సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న నాగబాబు.. రోజాపై చేసిన కామెంట్స్ జనాల్లో పలు చర్చకు దారి తీశాయి. తాజాగా ఈ అంశంపై మరోసారి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు మెగా బ్రదర్. ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన మెగా బ్రదర్.. నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలపై స్పందించారు.
ఈ క్రమంలో ‘సార్ జబర్దస్త్‌లో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఇంకెవరు జబర్దస్త్ జడ్జి సీటుపై కూర్చున్న ‘రోజా’ అంటూ ఆమె ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. జబర్దస్త్‌లో అంతమంది కమెడియన్స్ ఉండగా నాగబాబు దృష్టి రోజాపై ఎందుకు పడిందనే కోణంలో జనం చర్చలు మొదలుపెట్టారు. దీంతో ఇది కాస్త కొత్త కాంట్రవర్సీకి దారి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా అదే సోషల్ మీడియా వేదికగా మీమర్స్‌లో లైవ్‌లో ఇంటరాక్ట్ అయిన నాగబాబు.. ఈ కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యారు.
‘కమెడియన్ అనగానే ఎవ్వరైనా గెటప్ శ్రీను లాంటి వాళ్ల పేర్లు చెబుతానని అనుకుంటారు. అందుకే వెరైటీగా ఉంటుందని, మీ లాంటి వాళ్లు (మీమర్స్) షాక్ అవుతారని రోజా పేరు చెప్పాను’ అంటూ నాగబాబు ఓపెన్ అయ్యారు. అంతేకాదు ఈ మధ్య ఆమె పంచులు కూడా బాగానే వేస్తున్నారు కాబట్టి అలా చెప్పానని తెలిపారు. ఇకపోతే తమ మధ్య కొంతమేర రాజకీయపరమైన విభేదాలున్నా వ్యక్తిగతంగా ఎలాంటి కాంట్రవర్సీలు లేవని మెగా బ్రదర్ క్లారిటీ ఇచ్చారు.