
Meter Movie Censor Talk: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోలు ఏడాదికి 15 లేదా 20 సినిమాలు చేసేవాళ్ళు. ప్రతీ ఏడాది వీళ్ళ కేలండర్ మొత్తం నిండుగా ఉండేది, ప్రతీ ఏడాది ఒక్క రోజు కూడా ఖాళీ ఉండేవాళ్ళు కాదు. వారిలా ఇప్పుడు కిరణ్ సబ్బవరం కూడా రెండు నెలలకు ఒక సినిమాని విడుదల చేసేలా ఉన్నాడు.
మొన్నీమధ్యనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాని విడుదల చేసి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం,ఇప్పుడు ‘మీటర్’ అనే సినిమా ద్వారా ఏప్రిల్ 7 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ లో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను నిర్మిస్తూ ముందుకు దూసుకుపోతున్న ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ముందు సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సూపర్ హిట్ అవ్వడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి UA సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు కచ్చితంగా ఈ చిత్రం కిరణ్ సబ్బవరం కెరీర్ లో మరో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారట. ఈ చిత్రం లో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా, టెంపర్ మూవీ రేంజ్ మెసేజి కూడా ఉంటుందని సమాచారం.

ఈ చిత్రం లో హీరోయిన్ గా ‘ఆతుల్య రవి’ నటించింది.సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం ఈ చిత్రం నిడివి 127 నిమిషాలు ఉంటుందట. అంటే రెండు గంటల 7 నిమిషాల సినిమా అన్నమాట. ఈమధ్య కాలం లో తక్కువ నిడివి ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు నమోదు చేస్తున్నాయి, అలాగే ఈ ‘మీటర్’ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్.