Ka Movie Collections ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపిన చిత్రాలలో ఒకటి కిరణ్ అబ్బవరం నటించిన ‘క’. స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ స్క్రీన్ ప్లే ని నడిపించిన విధానం చాలా కొత్తగా, అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాని ఆడియన్స్ బాగా ఇష్టపడ్డారు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ లో కచ్చితంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అందరూ అంచనా వేశారు. ఈ సినిమాతో పాటు ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ వంటి సినిమాలు కూడా ఒకే రోజున విడుదల అయ్యాయి. మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ లో మాస్ సెంటర్స్ మొత్తాన్ని ‘క’ చిత్రం మిగిలిన రెండు సినిమాలను డామినేట్ చేసింది. కానీ లాంగ్ రన్ లో మాత్రం అనుకున్న టార్గెట్ ని చేరుకోలేకపోయింది. 18 రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మన ప్రాంతాలవారీగా వివరంగా చూద్దాం.
ముఖ్యంగా నైజాం ప్రాంతంలో 18 రోజులకు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతంలో 2 కోట్ల 82 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు, కోస్తాంధ్ర లో 7 కోట్ల 85 లక్షల రూపాయిలను రాబట్టింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి కోటి రూపాయిల షేర్, ఓవర్సీస్ లో 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టాయి. కిరణ్ అబ్బవరం కి మొదటి నుండి భారీ మార్కెట్ లేకపోవడం వల్ల ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక వంటి ప్రాంతాలలో ఓపెనింగ్స్ దగ్గర నుండే వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఓవరాల్ గా 18 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 38 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చింది.
ఇది నిజంగా కిరణ్ అబ్బవరం రేంజ్ కి భారీ వసూళ్లే కానీ, మొదటి వీకెండ్ లో ఉన్నటువంటి ఊపు ని చూసి, కచ్చితంగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు. కానీ ఆ టార్గెట్ మిస్ అవ్వడంతో అంచనాలకు తగ్గ వసూళ్లు రావడం లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ని ఈటీవీ వారు కొనుగోలు చేసారు. ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుండి ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.