Homeఎంటర్టైన్మెంట్Dil Ruba Twitter Talk : దిల్ రూబా ట్విట్టర్ టాక్: కిరణ్ అబ్బవరం మూవీకి...

Dil Ruba Twitter Talk : దిల్ రూబా ట్విట్టర్ టాక్: కిరణ్ అబ్బవరం మూవీకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్, ఇంతకీ హిట్టా ఫట్టా?

Dil Ruba Twitter Talk : క మూవీతో బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు కిరణ్ అబ్బవరం. ఈ చిన్న బడ్జెట్ మూవీ ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాల నుండి గట్టి పోటీ ఎదుర్కొనడంతో వసూళ్లు తగ్గాయి. లేదంటే కలెక్షన్స్ ఇంకా భారీగా ఉండేవి. క వంటి భారీ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న దిల్ రూబా మూవీపై సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు విశ్వ కరుణ్ తెరకెక్కించిన దిల్ రూబా మార్చి 14న విడుదల చేశారు.

Also Read : ప్రెస్ మీట్ లోనే నన్ను చిత్తకొట్టేయండి అంటూ సవాల్ విసిరినా ‘దిల్ రూబా’ నిర్మాత..ఇంత నమ్మకం ఏంటో!

దిల్ రూబా ప్రమోషన్స్ గట్టిగా చేశాడు కిరణ్ అబ్బవరం. దిల్ రూబా కథను అంచనా వేసిన వాళ్లకు అరుదైన బైక్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఓ బైక్ ని బహుమతిగా ఇచ్చాడు. ఇక దిల్ రూబా ట్రైలర్ ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం కి జంటగా రుక్షర్ థిల్లాన్, కాథీ డావిసన్ నటించారు. ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఇబ్బందిగా ఉంది అంటున్నా ఫోటోలు తీస్తున్నారంటూ, రుక్షర్ అసహనం వ్యక్తం చేసింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ ఏమో అనిపించింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. దిల్ రూబా మూవీ పర్లేదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దిల్ రూబా మూవీ లవ్ స్టోరీ ఆసక్తిగా మొదలవుతుంది. కానీ వెంటనే కమర్షియల్ లవ్ స్టోరీస్ ఫార్మాట్ లోకి జారుకుంటుంది. విలన్ ట్రాక్ కూడా ఫోర్స్డ్ గా ఉంది. కథలో భాగం అనిపించదు, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల అనవసరంగా ఫైట్ సీన్స్ పెట్టరేమో అనే భావన కలుగుతుంది.

అయితే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఎమోషనల్, యాంగ్రీ ఇంటెన్స్ సీన్స్ లో మంచిగా నటించాడు. రుక్షర్ థిల్లాన్ గ్లామర్ ఆకట్టుకుంది. దిల్ రూబా సినిమాకు బీజీఏం హైలెట్ గా ఉంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల మనసులు తాకుతాయి. డైలాగ్స్ సైతం దిల్ రూబా మూవీలో చెప్పుకోవాల్సిన విషయం. మొత్తంగా దిల్ రూబా రెగ్యులర్ లవ్ రొమాంటిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఈ వీకెండ్ కి ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. భారీ అంచనాలు పెట్టుకొని మాత్రం వెళ్లొద్దు.

Also Read : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ చిత్రం ‘డ్రాగన్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిందా..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

Exit mobile version