Kiran Abbavaram
Kiran Abbavaram : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఒక సెక్షన్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఈయన కెరీర్ లో అత్యధిక శాతం ఫ్లాపులే ఉన్నాయి కానీ, మంచి పొటెన్షియల్ ఉన్న హీరో, భవిష్యత్తులో పైకి ఎదుగుతాడు అనే నమ్మకాన్ని ట్రేడ్ లో కలిగించిన నటుడు ఈయన. వరుసగా మూడు డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత ఇక కెరీర్ అయిపోయింది అని అనుకుంటున్నా సమయంలో ‘క'(Ka Movie) లాంటి సూపర్ హిట్ చిత్రం తగిలింది. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక నుండి ఇలాంటి విభిన్నమైన సినిమాలనే తీస్తాడు అని అందరూ అనుకున్నారు. ఈ చిత్రం తర్వాత నేడు ఆయన నుండి విడుదలైన ‘దిల్ రూబా'(Dilruba Movie) చిత్రం మొదటి ఆట నుండే మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకుంది. కనీసం బుక్ మై షో యాప్ లో ట్రెండింగ్ కి కూడా ఈ సినిమా ఇంకా రాలేదంటే ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
Also Read : నిరాశపర్చిన కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ ఓపెనింగ్స్..మొదటిరోజు గ్రాస్ ఇంత దారుణంగా ఉందా!
సినిమాకు ఫ్లాప్ టాక్ రాలేదు, అలా అని సూపర్ హిట్ టాక్ కూడా రాలేదు. ఇదే రోజున ‘కోర్ట్'(Court Movie) చిత్రం కూడా విడుదల అవ్వడం వల్ల అందరూ ఆ సినిమా వైపే మొగ్గు చూపారు. ఆ ప్రభావం చాలా బలంగా ‘దిల్ రూబా’ పై పడింది. ఈ వీకెండ్ లోపు ఈ చిత్రాన్ని ఆడియన్స్ గుర్తిస్తే కనీసం బ్రేక్ ఈవెన్ మార్కు దగ్గరకు అయినా వెళ్తుంది. లేదంటే కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో ఫ్లాప్ అని అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే కిరణ్ అబ్బవరం తన భవిష్యత్తు ప్రణాళికలను చాలా గట్టిగానే చేస్తున్నాడు. ఆయన చేతిలో ఎలాగో ‘క’ మూవీ సీక్వెల్ ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడు విడుదలైనా భారీ వసూళ్లను చూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే కిరణ్ అబ్బవరం త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్ హిట్స్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) కెరీర్ లో మరో సూపర్ హిట్ చిత్రం లేదు. కానీ ఈ రెండు సినిమాలు టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచాయి. మంచి సత్తా ఉన్న డైరెక్టర్ కానీ, హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు. రీసెంట్ గానే ఆయన కిరణ్ అబ్బవరం ని కలిశాడట. గోదావరి నేపథ్యం లో ఉన్న ఒక మంచి ఎమోషనల్ కథని సిద్ధం చేయమని అన్నాడట. స్క్రిప్ట్ నచ్చితే కచ్చితంగా కలిసి సినిమా చేద్దామని అన్నాడట. మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇద్దరికీ కూడా కమర్షియల్ సక్సెస్ అత్యవసరం కాబట్టి, మంచి సినిమానే వస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.