Deputy CM Pawan Kalyan: జనసేన(Janasena Party) 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పిఠాపురం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు పలు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసారు. దాదాపుగా 7 లక్షల మంది ఈ సభకు హాజరైనట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సభలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. అదే విధంగా నాలుగు దశాబ్దాల తెలుగు దేశం పార్టీ ని నిలబెట్టాం వంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా టీడీపీ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కోపగించుకునేలా చేసింది. చాలా రోజుల నుండి టీడీపీ, జనసేన పార్టీ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆ గొడవలపై పెట్రోల్ పోసినట్టు అయ్యింది.
చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఇదే సభలో ఉన్నాయి కానీ సోషల్ మీడియా లో ఆ చిన్న క్లిప్ కి బాగా ట్రిగ్గర్ అయ్యారు తెలుగు తమ్ముళ్లు. ఇక ఇదంతా కాసేపు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ తానూ ఒకప్పుడు ఎంత బలంగా ఉండేవాడో, ఇప్పుడు ఎంత బలహీన పడ్డాడో ఒక ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను రాజకీయాల్లోకి రాకుండా కేవలం సినిమాల్లో ఉన్నప్పుడు అప్పట్లో గుండెల మీద బండరాళ్లను పెట్టుకొని పగలగొట్టించుకునేవాడిని. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యాన్ని కోల్పోయాను. ఆరోజుల్లో అంత బలంగా ఉండే నేను ఇప్పుడు నా రెండవ బిడ్డ ని ఎత్తుకోలేకపోయే పరిస్థితి ఏర్పడింది. పెద్ద కొడుకుని ఎలాగో ఎత్తుకోలేను అనుకోండి. అంత బలహీనపడ్డాను. మళ్ళీ బలవంతుడిని అవుతున్నాను, మీ అందరూ అండ ఉంది కదా’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలం లో షూటింగ్ కి వెళ్లట్లేదు, కావాలని వెళ్లడం లేదని అందరూ అనుకున్నారు, కానీ ఆయనకు ఆరోగ్యం అసలు సహకరించడం లేదని ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
హెలికాప్టర్లో సభ వద్దకు వస్తుంటే ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ పోస్టర్లు కనిపించాయి
అందరూ హీరోల అభిమానులకు నా ప్రత్యేక నమస్కారాలు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/miXUDiE0zQ
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2025