Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం క మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. పరాజయాలతో ఇబ్బంది పడ్డ ఈ యంగ్ హీరో అంచనాలకు మించి బాక్సాఫీస్ కొల్లగొట్టాడు. కిరణ్ అబ్బవరం మార్కెట్ రీత్యా రూ. 50 కోట్ల వసూళ్లు ఊహించని పరిణామం. క మూవీ విడుదలకు ముందు కిరణ్ అబ్బవరం చేసిన ఓ కామెంట్ సంచలనంగా మారింది. ఆయన సవాల్ విసిరాడు. నన్ను, నా సినిమాలను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? క మూవీ గొప్పగా ఉంటుంది. ఈ సినిమా ఆడకపోతే ఇకపై సినిమాలు చేయను అంటూ పబ్లిక్ లో చెప్పాడు. నిజంగా అది చాలా పెద్ద సాహసం.
Also Read : హీరో కాకపొయ్యుంటే రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని..ఆ పార్టీ లో చేరేవాడిని అంటూ కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్!
ఒకవేళ క మూవీ ఆడకపోతే కిరణ్ అబ్బవరం నటనకు దూరం కావాలి. కాదని ఒట్టు గట్టుపై పెట్టి సినిమాలు చేస్తే జనాలు ఏకిపారేస్తారు. సోషల్ మీడియా యుగంలో అటువంటి స్టేట్మెంట్స్ ఆత్మహత్యాసదృశ్యం. క మూవీ సక్సెస్ కావడంతో కిరణ్ అబ్బవరం ఇదే ఫార్మలా తన లేటెస్ట్ మూవీకి కూడా వాడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దిల్ రూబా మూవీ మార్చి 14న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది.
దిల్ రూబా రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కించారు. యాక్షన్ ఎపిసోడ్స్ సైతం జోడించారు. దిల్ రూబా మూవీ కథను గెస్ చేసిన వాళ్లకు అరుదైన బైక్ గిఫ్ట్ గా ఇస్తానన్న కిరణ్ అబ్బవరం తన మాట నిలబెట్టుకున్నాడు. కిరణ్ అబ్బవరం మరో కీలక ప్రామిస్ చేశాడు. కృష్ణానగర్ లో కష్టాలు పడుతున్న 10 మందిని నేను ఆదుకుంటాడు అని మాటిచ్చాడు. చిత్ర పరిశ్రమలో రాణించాలని హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు చేసి విసిగిపోయి, సొంత ఊరు వెళ్లిపోవాలని అనుకుంటున్న పది మందికి సహాయం చేస్తాను అంటున్నాడు.
సినిమా ప్రపంచం మొత్తం కృష్ణానగర్ లోనే ఉంటుంది. సక్సెస్ అయిన వారు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో స్థిరపడతారు. బ్రేక్ రాని వాళ్ళు కృష్ణానగర్ లో ఇరుకుగదుల్లో అద్దెకు ఉంటూ… మంచి భోజనం చేయడానికి కూడా డబ్బులు లేక కష్టాలు పడుతుంటారు. అలాంటి వారిని కిరణ్ ఆదుకునేందుకు కిరణ్ అబ్బవరం ముందుకు వచ్చాడు. స్టార్ హీరోలు సైతం ఇంత వరకు వారి గురించి ఆలోచించలేదు. మరి కిరణ్ అబ్బవరం ఏ మేరకు వాళ్లకు సహాయం చేస్తాడో చూడాలి.
Also Read : మాజీ ప్రియుడికి పెళ్లి చేసే ప్రేయసి.. ఆసక్తి రేపుతున్న కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ మూవీ స్టోరీ!