Ka Movie Collections : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’ ఇటీవలే దీపావళి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత కిరణ్ అబ్బవరం పని ఇక అయిపోయింది, ఆయనతో సినిమాలు ఎవ్వరూ చేయరు అని అనుకుంటున్న సమయంలో ఈ చిత్రం ఆయన కెరీర్ ని ఒక మలుపు తిప్పి మైల్ స్టోన్ గా నిల్చింది. ఈ సినిమా టీజర్ ని చూసినప్పుడు ప్రతీ ఒక్కరు షాక్ కి గురయ్యారు. కిరణ్ అబ్బవరం నుండి ఇంతటి స్థాయి క్వాలిటీ సినిమానా?, భారీ బడ్జెట్ పెట్టినట్టు ఉన్నారు, ఆయన స్థాయికి మించి ఇంత బడ్జెట్ అవసరమా అని చాలా మంది అనుకున్నారు. కానీ బడ్జెట్ అందరూ అనుకున్నట్టు 70 కోట్లు, 100 కోట్లు కాదు. కేవలం 12 కోట్లు మాత్రమే. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి 30 కోట్ల రూపాయలకు జరిగింది.
విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురుస్తుంది. విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల వరకు రెండు కోట్ల రూపాయలకు తగ్గకుండా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వర్కింగ్ డేస్ లోనే స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటుంది. 5వ రోజు 90 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమాకి 6 వ రోజు 81 లక్షలు, 7వ రోజు 83 లక్షలు వచ్చాయి. ఎంత స్టడీ గా ఈ చిత్రానికి రోజువారీ వసూళ్లు వస్తున్నాయో మీరే చూడండి. ఓవరాల్ గా మొదటి వారం ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం 11 కోట్ల 68 లక్షల షేర్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
ప్రాంతాలవారీగా చూస్తే నైజాం ప్రాంతంలో 4 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ లో 2 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో 5 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం వీకెండ్ తర్వాత ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మొదటి వారం లో ఈ చిత్రానికి 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ లో మొదటి వారం 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ లో ఓవర్సీస్ వసూళ్లు కూడా పుంజుకుంటాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక గ్రాస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయిలు వచ్చాయట. ఈ వీకెండ్ తో 35 కోట్ల రూపాయిల మార్కుని దాతుంటుందని అంచనా వేస్తున్నారు.