Donald Trump : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా గెలిచి.. అమెరికన్ల మనసు దోచి ట్రంప్.. శ్వేత దేశానికి 47 వ అధ్యక్షుడిగా నియమితులు కాబోతున్నారు. 2016లో హిల్లరీ క్లింటన్ మీద ట్రంప్ విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో కమల మీద గెలుపును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో ఏ దేశాధినేతకు కూడా ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉండి ఉండదు. ప్రస్తుతం ట్రంప్ వయసు 79 సంవత్సరాలు. అమెరికా అధ్యక్ష పదవిని ట్రంప్ చేపట్టడం ఇది రెండవసారి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ భావోద్వేగంగా మాట్లాడారు. “అమెరికన్ ప్రజలు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో ఫలితాలను ఇచ్చారు. నాపై నమ్మకం ఉంచారు. వారికి నా కృతజ్ఞతలు. నా జీవితంలో ఇలాంటి క్షణం చూడలేదు. నన్ను ఎన్నుకున్నందుకు అమెరికన్ ప్రజల కష్టాలు తీర్చుతాను. అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానని” ట్రంప్ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. రాజకీయ ప్రయాణం మొదటినుంచి ఒకేదారిలో కొనసాగలేదు. ఆయన కొద్ది రోజులు రిఫార్మ్ పార్టీలో కొనసాగారు. మూడు సంవత్సరాల అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు.
బైడన్ చేతిలో ఓడిపోయినప్పటికీ..
2020లో జరిగిన ఎన్నికల్లో బైడన్ చేతిలో ట్రంప్ ఓడిపోయాడు. ఆయనప్పటికీ పార్టీపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. బయట ఎంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ.. అతడు అధ్యక్ష పదవికి అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. హత్యాయత్నానికి గురికావడం, పెద్దల చిత్రాల నాటితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం.. వంటి ఆరోపణలు ట్రంప్ ను ఉక్కిరిబికిరి చేశాయి. అంతేకాదు ఆ మధ్య ఒకేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగించారు. అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాలను ఓటర్లకు అర్థమయ్యేలా ట్రంప్ చెప్పగలిగారు. ఇదే సమయంలో డెమొక్రటిక్ పార్టీ తన అధ్యక్ష అభ్యర్థిగా బైడన్ ను తప్పించి కమలా హారిస్ పేరు ప్రకటించింది. ఆమె ట్రంప్ ఆధిక్యాన్ని మాత్రమే తగ్గించగలిగింది. ఆయన విజయాన్ని నిలువరంచలేకపోయింది. ట్రంప్ కు చంచలమైన స్వభావం ఉన్నప్పటికీ.. నోటి దురుసు అధికంగా ఉన్నప్పటికీ.. అమెరికన్లు ఆయన అభ్యర్థిత్వాన్ని కోరుకున్నారంటే.. దానికి కారణం అతడిలో ఉన్న అమెరికన్ ను వారు చూసుకోవడమే.. అందువల్లే అతడిని గెలిపించారు. రెండవసారి అధ్యక్షుడిని చేశారు. అమెరికా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పగలగడం వల్లే ట్రంప్ విజయం సాధించగలిగారని గ్లోబల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ట్రంప్ అమెరికా రాజకీయాలలో సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడుతున్నాయి. అయితే ట్రంప్ కొనసాగించిన దూకుడు ఆయనను ఎన్నికలలో విజేతగా నిలిపాయని అమెరికన్ మీడియా వ్యాఖ్యానిస్తోంది.