America  Vice President :  అమెరికా వైస్ ప్రెసిడెంట్ తెలుగింటి అల్లుడు.. అతడికి మన నేలతో బంధుత్వం ఎలా ఏర్పడిందో తెలుసా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయం ద్వారా అమెరికాకు ట్రంప్ 47వ అధ్యక్షుడు కాబోతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 6, 2024 8:29 pm

JD Vance

Follow us on

America  Vice President :  ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో అమెరికావ్యాప్తంగా రిపబ్లికన్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు..” అమెరికా గెలిచింది. మళ్లీ దృఢంగా నిలబడబోతోంది.. ఇది ప్రజాస్వామ్యం కల్పించిన విజయం. ఇది అమెరికా చరిత్రలో సువర్ణ అధ్యాయమని” రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. బైడన్ ను ఓడించి ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో.. గ్లోబల్ మీడియా ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేస్తోంది. అనేక సంక్షోభాలను ఎదిరించి ట్రంప్ విజేతగా నిలిచారని కొనియాడుతోంది. అయితే ట్రంప్ విషయంలో మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. జేడీ వాన్స్ మాత్రం కీలకపాత్ర పోషించాడు. అమెరికాలో అక్రమ చొర బాట్లు, దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాలను ఎప్పటికప్పుడు వివిధ వేదికల వద్ద వాన్స్ వివరించాడు. ట్రంప్ పై జూలైలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు తెగబడటం.. ఆ ఘటన తర్వాత ట్రంప్ చరిష్మా ఒక్కసారిగా అమెరికా వ్యాప్తంగా పెరిగిపోయింది. అయితే దానిని ఏమాత్రం తగ్గనీయకుండా చూసి వాన్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

తెలుగింటి అల్లుడు

వాన్స్ ఒహియో సేనేటర్ గా ఎన్నికయ్యారు. గతంలోనూ ఆ ప్రాంతానికి ఆయన సేనేటర్ గా పనిచేశారు. తనపై కాల్పులు జరిగి, కోలుకున్న తర్వాత ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ పదవికి వాన్స్ పేరును ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.. జెడి వాన్స్ అమెరికాకు భూగర్భ శాస్త్ర విభాగంలో సేవలందించారు. ఆయన ఒహియో స్టేట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. యేల్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యలో పట్టభద్రులయ్యారు. వాన్స్ ఆ విశ్వవిద్యాలయంలో చావుతున్నప్పుడు “హిల్ బిల్లీ ఎలేజ్” అన్న పుస్తకాన్ని రచించాడు. అది అమెరికాలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకంగా రికార్డు సృష్టించింది. వాన్స్ 2010లో యేల్ లా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తెలుగు మహిళ చిలుకూరి ఉష పరిచయమైంది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. నాలుగు సంవత్సరాలు పాటు డేటింగ్ చేసిన అనంతరం.. 2014లో పర్ పెళ్లి చేసుకున్నారు. వాన్స్, ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు. వారి పేర్లు ఇవాన్, వివేక్, మిరా బెల్. ఉష తల్లిదండ్రులది పశ్చిమగోదావరి జిల్లా. ఉష తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు..వాన్స్ సేనేటర్ గా పోటీ చేస్తున్నప్పుడు ఉష ఆయన తరఫున ప్రచారం చేశారు. సేనేటర్ గా గెలిచిన తర్వాత తన భార్య గొప్పతనం గురించి వాన్స్ అనేక సందర్భాల్లో గొప్పగా చెప్పాడు. ఇక ఉష శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డిసి లో లిటిగేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకంటే ముందు ఆమె అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్. జీ రాబర్ట్స్ జూనియర్, న్యాయమూర్తులు బ్రెంట్ కవనాగ్, అమూల్ థాపర్ వద్ద క్లర్క్ గా విధులు నిర్వర్తించారు.