OG: మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రోజులివి. అలాంటిది పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan)
లాంటి స్టార్ హీరో ఒక యాక్షన్ సినిమా చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కావాలని అభిమానులు కోరుకుంటారు కదా?, అది కూడా ఆయన కెరీర్ లోనే భారీ క్రేజ్ తో విడుదల అవ్వబోయే ఓజీ చిత్రం గురించి ఎన్ని అంచనాలు పెట్టుకొని ఉంటారు?, కానీ మేకర్స్ ఈ చిత్రాన్ని కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితం చేస్తారని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించలేదు. కేవలం నామమాత్రం గానే ఇతర భాషల్లో విడుదల చేశారు. నెట్ ఫ్లిక్స్ లో భారీ రేట్ కి సినిమాని నాలుగు వారాల తర్వాత విడుదల చేస్తామని ఒప్పందం కుదిరించుకోవడంతో నార్త్ ఇండియా లో ఉండే రూల్స్ ప్రకారం ఈ సినిమాని నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల చేయలేదు.
మూవీ మ్యాక్స్ అనే అతి తక్కువ ప్రాధాన్యత ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ లోనే విడుదల చేశారు. ఒక్కటంటే ఒక్క సింగిల్ స్క్రీన్ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయలేరు. ఇలా నిర్మాతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కేవలం హిందీ వెర్షన్ నుండి 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా, కేవలం పది కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క ప్రాంతం నుండే వంద కోట్ల నష్టం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకే అభిమానులు సోషల్ మీడియా మేకర్స్ ని ట్యాగ్ చేసి తిట్టని రోజంటూ లేదు. 300 కోట్ల రూపాయలకు పైగా ఈ చిత్రం గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వసూళ్లు మొత్తం తెలుగు వెర్షన్ నుండి వచ్చినవే. అంత మంచి క్వాలిటీ తో తీసిన సినిమాని ఒక్క బాషకే పరిమితం చేయడం ఎంత వరకు సమంజసం?, అభిమానులకు ఇది ద్రోహం చేసినట్టు కాదా?.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తప్ప మిగిలిన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టారు. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు కూడా గ్రాండ్ గా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక మిగిలిపోయేది పవన్ కళ్యాణ్ ఒక్కడే. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కి మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది. 2024 ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన తర్వాత ఆయన పేరు దేశవ్యాప్తంగా ఒక రేంజ్ లో మారుమోగిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ప్రియా శిష్యుడిగా నార్త్ ఇండియన్స్ పవన్ ని ఒక రేంజ్ లో ఆదరిస్తారు. ఓజీ చిత్రాన్ని గ్రాండ్ గా హిందీ లో రిలీజ్ చేస్తూ, ప్రొమోషన్స్ కూడా భారీ లెవెల్ లో చేసుంటే, నేడు ఓజీ చిత్రం 500 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరి ఉండేది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. కనీసం ఓజీ సీక్వెల్, లేదా ప్రీక్వెల్ ని అయినా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల చేస్తారో లేదో చూడాలి.