Kiran Abbavaram : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ‘రాజా వారు రాణివారు’ చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచయమైన ఆయన, ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ లను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మధ్యలో ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఇక కిరణ్ అబ్బవరం పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్నా సమయంలో ‘క'(Ka Movie) చిత్రం విడుదలైంది. ఈ సినిమా గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి చిత్రమిది. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘దిల్ రుబా’ అనే చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రాన్ని ముందుగా వాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో మహాశివరాత్రి కి అయినా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కుదరకపోతుండడంతో వచ్చే నెల 14 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. వాలెంటైన్ డే సందర్భంగా విడుదలైన కొత్త చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి. వాటిల్లో లైలా చిత్రమైతే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ స్టేటస్ ని తెచ్చుకుంది. దీంతో వాలెంటైన్ డే కి కేవలం పాత సినిమాల రీ రిలీజ్లు, తండేల్, అదే విధంగా సంక్రాంతికి విడుదలైన సినిమాలే థియేటర్స్ కి ఫీడింగ్ గా నిలిచాయి. ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబ'(Dill Ruba) చిత్రం విడుదల అయ్యుంటే కచ్చితంగా పెద్ద హిట్ అయ్యేదని విశ్లేషకుల అభిప్రాయం.
వాలెంటైన్ డే మిస్ అయినా, మహాశివరాత్రికి విడుదలైనా కూడా కమర్షియల్ గా కళ్ళు చెదిరే వసూళ్లను ఈ చిత్రం రాబట్టి ఉండేది. కానీ అది కూడా జరగకపోవడంతో కిరణ్ అబ్బవరం బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యాడని అందరూ అనుకుంటున్నారు. ఈ రెండు రిలీజ్ డేట్స్ లో ఎదో ఒక డేట్ లో వచ్చి కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యేదని, ఇప్పుడు ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. విడుదల తేదీ వాయిదా పడడం వల్ల సినిమా బిజినెస్ పై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా గొప్ప రెస్పాన్స్ ఏమి రాలేదు. ‘క’ చిత్రంతో వచ్చిన క్రేజ్ ని సరిగ్గా ఉపయోగించుకొని ఈ నెలలో విడుదల చేసి ఉండుంటే కిరణ్ అబ్బవరం కచ్చితంగా సక్సెస్ చూసేవాడిని విశ్లేషకుల అభిప్రాయం.