Homeఎంటర్టైన్మెంట్Kiraak RP: అల్లు అర్జున్ నీకు పతనం తప్పదు... అమ్మో, కిరాక్ ఆర్పీ ఇలా ఫైర్...

Kiraak RP: అల్లు అర్జున్ నీకు పతనం తప్పదు… అమ్మో, కిరాక్ ఆర్పీ ఇలా ఫైర్ అయ్యాడేంటి!

Kiraak RP: ఒక మాజీ జబర్దస్త్ కమెడియన్ మెగా హీరో అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ… నేను ఎవడికీ భయపడను, అంటూ ఫైర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. ఈ వివాదం వెనుక నేపథ్యం ఏమిటో పరిశీలిస్తే… మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన వెనుక నిలిచిన సంగతి తెలిసిందే. చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ప్రత్యక్షంగా తమ మద్దతు జనసేనకు ప్రకటించారు. కొందరు నేరుగా ఎన్నికల క్యాంపైన్ చేశారు.

అల్లు అర్జున్ సైతం తన మద్దతు పవన్ కళ్యాణ్ కి తెలియజేశాడు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరాలని, తన సపోర్ట్ ఆయనకు ఎప్పుడూ ఉంటుందని కామెంట్ చేశాడు. అయితే ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా చివరి రోజున అల్లు అర్జున్ తన మిత్రుడు శిల్పా రవి రెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఆయన నంద్యాల వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం పరోక్షంగా వైసీపీకి ఆయన మద్దతు తెలిపినట్లు అయ్యింది.

పవన్ కళ్యాణ్ కోసం ఒక ట్వీట్ వేసిన అల్లు అర్జున్, వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం ఏమిటని జనసేన నేతలు నొచ్చుకున్నారు. నాగబాబు పోలింగ్ ముగిసిన వెంటనే అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ గా చురకలు అంటించాడు. హర్ట్ అయిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబును ట్రోల్ చేశారు. కాగా మాజీ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ అల్లు అర్జున్ తీరును విమర్శించారు. మెగా హీరోలు జనసేన కోసం కష్టపడుతుంటే మీరు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం నచ్చలేదని అసహనం వ్యక్తం చేశాడు.

Also Read: Kalki Trailer: కల్కి ట్రైలర్ లీక్: హైలెట్స్ ఇవే.. నిడివి ఎంతంటే?

అల్లు అర్జున్ మీద విమర్శలు చేసిన కిరాక్ ఆర్పీ మీద ఫ్యాన్స్ దాడి చేశారు. ఈ క్రమంలో ఘాటైన విమర్శలు చేస్తూ కిరాక్ ఆర్పీ మరో వీడియో వదిలాడు. వైసీపీ ప్రభుత్వం మాదిరే నీకు పతనం మొదలైంది. నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ. నేను ఎవడికీ భయపడను. నీకు ఆర్మీ లేదు. ఆర్మీ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు. నీకు చేతనైంది చేసుకో అని… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. కిరాక్ ఆర్పీ సంచలన వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Suriya: సూర్య కొత్త సినిమాను పుష్ప తో ఎందుకు పోలుస్తున్నారు…

Exit mobile version