Homeఎంటర్టైన్మెంట్Kiraak RP: బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్ఫీ..వీడియో వైరల్!

Kiraak RP: బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్ఫీ..వీడియో వైరల్!

Kiraak RP: జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షోతో ప్రేక్షకులను అలరిస్తూ వాళ్లకు బాగా దగ్గరైన కిరాక్ ఆర్ఫీ(Kiraak RP), ఆ తర్వాత జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చి, సినిమాల్లో నటించేందుకు ప్రయత్నం చేయడం, ఆ తర్వాత దర్శకుడిగా మారి ఒక సినిమాని కూడా తెరకెక్కించాలని అనుకోవడం, కానీ అది కూడా కుదరకపోవడం తో హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు’ అనే రెస్టారంట్ ని స్థాపించి గ్రాండ్ గా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాపారం లో సక్సెస్ అయ్యాక ఆయన తెలుగు దేశం పార్టీ లో చేరడం కూడా జరిగింది. స్వతహాగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి ఫాలోవర్ కాబట్టి, ఈయన తెలుగు దేశం పార్టీ లో చేరాడు. వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం పై చేసే కామెంట్స్ , అదే విధంగా వైసీపీ నాయకులూ చేసే కామెంట్స్ కి కౌంటర్లు ఇవ్వడం లో కిరాక్ ఆర్ఫీ నేర్పరి.

ముఖ్యంగా ఇతను మాట్లాడే తీరుని చూసి వైసీపీ పార్టీ ఫ్యాన్స్ కి కోపం తారా స్థాయిలో ఏర్పడింది. మేము అధికారం లోకి వచ్చిన తర్వాత కిరాక్ ఆర్ఫీ ని చంపేస్తాము అంటూ బెదిరింపులు కూడా చేశారు. ఆ రేంజ్ కోపం లో ఉన్నారు. అయితే రీసెంట్ గానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు అయ్యాయి. శాసన మండలి లో బొత్స సత్య నారాయణ వైసీపీ తరుపున ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీనిపై కూటమి కి సపోర్టుగా, బొత్స సత్యనారాయణ ని విమర్శిస్తూ రీసెంట్ గానే కిరాక్ ఆర్ఫీ ఒక వీడియో చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రభుత్వం చేసే తప్పులను ఎట్టి చూపడం తప్ప,బొత్స సత్యనారాయణ ఏ రోజు కూడా ఒక మనిషిని కించపరిచే విధంగా మాట్లాడలేదని, అలాంటి మనిషి మీద నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని వైసీపీ పార్టీ అభిమానులు, బొత్స అభిమానులు కామెంట్స్ చేశారు.

అయితే ఈ కామెంట్స్ పై కిరాక్ ఆర్ఫీ స్పందిస్తూ, బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నిన్న నేను బొత్స సత్యనారాయణ గారి మీద చేసినటువంటి వీడియో, ఆయన్ని , ఆయన అభిమానులను బాధపెట్టినట్టు నాకు తెలిసింది, అందుకు నేను తీవ్ర స్థాయిలో చింతిస్తున్నాను ,కానీ నేను ఆయనపై ఎలాంటి వ్యక్తి గత విమర్శలు చేయలేదు, ఎలాంటి బూతులు మాట్లాడలేదు, ఏ సామజిక వర్గాన్ని కూడా టార్గెట్ చెయ్యలేదు. పబ్లిక్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి దుర్భాషలు ఆడినప్పటికీ బొత్స గారు సామర్దించడాన్ని మాత్రమే నేను తప్పు పట్టాను. నేను కాస్త ఆయన్ని ఇమిటేట్ చేసాను కూడా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు కిరాక్ ఆర్ఫీ. ఆ వీడియో ని మీరు క్రింద చూడొచ్చు.

భయం స్టార్ట్ అయ్యింది..

అందుకే క్షమాపణలు కోరుతూ వీడియో చేశాడు..

నాకు తెలిసి ఇప్పటివరకు బొత్స సత్యనారాయణ గారు ఏ ఒక్కరి గురించి కూడా తప్పుగా (వ్యక్తిత్వ హననం) మాట్లాడింది లేదు..

అలాంటి మనిషిని పట్టుకుని నిన్న వ్యంగంగా మాట్లాడినాడు .. pic.twitter.com/TNa1bQwuJE
— వై.యస్.‌ఆర్‌ కుటుంబం™ (@_Ysrkutumbam) February 16, 2026

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version