Homeబిజినెస్SDV Vehicle: 90 శాతం వాహనదారులు SDV వైపే..DGAC సంచలన సర్వే..

SDV Vehicle: 90 శాతం వాహనదారులు SDV వైపే..DGAC సంచలన సర్వే..

SDV Vehicle: భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే కార్లు కొనే సమయంలో కొంతమంది ధర విషయం ఆలోచిస్తారు.. మరికొందరు మైలేజ్ గురించి ఆరా తీస్తారు. అయితే ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేల ప్రకారం నేటి భారతీయులు ఎక్కువగా SDV గురించి ఆలోచిస్తున్నట్లు తేలింది. Software Define Vehicle(SDV) వినియోగంపై ఇటీవల కొంతమంది వినియోగదారులను తీసుకొని సర్వే నిర్వహించగా 95 శాతం మంది దీనిని ఇష్టపడుతున్నట్లు తేలింది. ధర, మెరుగైన ఇంజన్ కంటే సాఫ్ట్వేర్లు చాలా ఇంపార్టెంట్ అని నేటి వినియోగదారులు ఆలోచిస్తున్నట్లు తేలింది. ఈ సర్వే వివరాలులోకి వెళ్తే..

Delight Global Automotive Consumer (DGAC) అనే సంస్థ చేసిన స్టడీ ప్రకారం భారతదేశంలో 95 శాతం మంది SDV ఉండే వాహనాల కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా 2025 సంవత్సరంలో అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో మధ్య వయసు ఉన్న 1501 మందిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ధర, కారు పనితీరు, సాంప్రదాయ అవసరాలు, స్మార్ట్ కనెక్టివిటీ, ఓవర్ ది ఎయిర్ అప్డేట్, సాఫ్ట్వేర్ ఎనేబుల్ సేవలపై పెరుగుతున్న ప్రాధాన్యతతో పాటు భారతీయ వినియోగదారుల వాహన విలువను అంచనా వేసే విధానంలో మార్పును గమనిస్తూ పరిశోధన చేశారు. అయితే వీరిలో 81 శాతం మంది SDV లు వాహనదారులకు తప్పనిసరిగా మారిందని చెప్పారు. 84 శాతం మంది AI ఎనేబుల్ వెహికల్ కష్టమైజేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆటోమోటివ్ రంగానికి చెందిన నిపుణుడు రజత్ మహాజన్ మాట్లాడుతూ ఇంటర్నెట్, వ్యవస్థాగత ఆవిష్కరణల ద్వారా భారతదేశం కొత్త యుగంలోకి అడుగుపెట్టబోతుంది.. ఈ సమయంలో వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయని అన్నారు.

దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం వాహనాల కొనుగోలులో స్మార్ట్ ఫీచర్స్ తప్పనిసరిగా మారిందని తెలుస్తోంది. వీటి గురించి సోషల్ మీడియా ఇతర వెబ్సైట్లో ద్వారా ప్రచారం చేసుకోవడం ద్వారా కంపెనీలు తమ సేల్స్ పెంచుకోవచ్చని అంటున్నారు. 58 శాతం మంది వినియోగదారులు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్మార్ట్ ఫీచర్స్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 79 శాతం మంది వాహన దారులు వాహనం కొనుగోలు చేసేటప్పుడే బీమాను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల ఎంపికలో సిద్ధ చూపుతున్నట్టు తెలుస్తుంది.. అలాగే హైబ్రిడ్ వాహనాలపై కూడా దృష్టి పెడుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.. కానీ వాటి కొనుగోలు శక్తి మాత్రం పెరగడం లేదని పేర్కొంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version