Anise Packet In Beer Bottle: నేటి కాలంలో బీరు తాగడం అనేది సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు బీర్ల అమ్మకాలు ఎండాకాలంలో జోరుగా ఉండేవి. వర్షాకాలంలో తక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు కాలాలతో సంబంధం లేకుండా బీర్ల వ్యాపారం బీభత్సంగా సాగుతోంది. పైగా బీర్లు తాగే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రభుత్వం రేట్లు పెంచినప్పటికీ తాగే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తున్నప్పటికీ చాలామంది బీర్లు తాగడాన్ని ఆపడం లేదు. పైగా గతానికంటే ఎక్కువ సంఖ్యలో బీర్లను తాగుతున్నారు. అయితే అలా బీరు తాగాలని అనుకున్న ఓ వ్యక్తి వైన్ షాప్ కి వెళ్ళాడు. అక్కడ ఒక బీరు సీసాకు కొనుగోలు చేశాడు. తాగుదామని మూత తెరిచి చూసేసరికి అతడి కళ్ళు బైర్లు కమ్మాయి.
Also Read: వార్ 2 లో ఎన్టీఆర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయిన ఎందుకు చేశాడో తెలుసా..?
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో సమోసా కొనుగోలు చేసిన కుటుంబానికి అందులో పాము కనిపించడం సంచలనం కలిగించింది. దానిని మర్చిపోకముందే ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఓ వైన్ షాపులో ఒక వ్యక్తికి షాకింగ్ పరిణామం ఎదురైంది. వాదనపేట మండలం ఇల్లంద ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బీరు కొనుగోలు చేయడానికి వైన్ షాప్ కి వెళ్ళాడు. అక్కడ బీర్ కొనుగోలు చేశాడు. అయితే బీరు తాగడానికి మూత ఓపెన్ చేశాడు. అంతే దెబ్బకు అతడికి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఎందుకంటే ఆ బీరు సీసా అడుగు ప్రాంతంలో ప్యాకెట్ కనిపించింది. పైగా బీర్ కూడా అశుభ్రంగా ఉంది. దీంతో ఆ వ్యక్తి వైన్ షాప్ నిర్వాహకులతో గొడవ పెట్టుకున్నాడు. దానికివారు.. ఇందులో మా తప్పు ఏమీలేదని.. మేము కేవలం బీర్లను విక్రయించే వ్యక్తులం మాత్రమేనని పేర్కొన్నారు.
ఆ వ్యక్తికి మాత్రమే కాదు ఇటీవల చాలామందికి ఇదే అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. ఆ కంపెనీకి చెందిన బీర్లలో అడుగు భాగంలో సోంపు ప్యాకెట్లు వస్తున్నాయని.. సీసాలలో ఉన్న బీరు కూడా అశుభ్రంగా ఉంటున్నదని.. నాచు.. పురుగులు కూడా కనిపిస్తున్నాయని మద్యం ప్రియులు అంటున్నారు. అయితే దీనిపై ఎక్సైజ్ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తానని ఆ వ్యక్తి అన్నాడు. ఇటువంటి బీర్లు తాగడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయని.. వినియోగదారుల వద్ద భారీగా దండుకుంటూ ఇలాంటి బీర్లను అంటగట్టడం ఏంటని మద్యం ప్రియులు మండిపడుతున్నారు.
బీరు సీసాలో షాకింగ్ సోంపు ప్యాకెట్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద ప్రాంతంలో బీరు కొనుగోలు చేసిన వ్యక్తికి షాకింగ్ పరిణామం ఎదురైంది.
ఓ షాపులో బీర్ కొనుగోలు చేసిన వ్యక్తికి.. దాని మూత తీసి తాగుదామని ప్రయత్నిస్తుండగా.. సీసా అడుగుభాగం లో సోంపు ప్యాకెట్ కనిపించింది. దీంతో… pic.twitter.com/DMCrSwuAZv
— OkTelugu (@oktelugunews) August 14, 2025