Kingdom movie team meets Pawan Kalyan: రేపు విడుదల అవ్వబోతున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం కోసం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ బాగా డౌన్ అయ్యింది. కొన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ, వాటి వల్ల బయ్యర్స్ కి కలిగిన లాభాలు అంతంత మాత్రమే. తమని ఈ కష్టాల నుండి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం బయటపడేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా కాస్త డిజాస్టర్ ఫ్లాప్ అయ్యి కూర్చుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణంగా వీకెండ్ వరకు థియేటర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడింది. కానీ నార్మల్ వర్కింగ్ డేస్ లో వసూళ్లు ఢమాల్ అని పడిపోయాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ వైపు మరలింది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Also Read: కింగ్డమ్ మూవీ ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది..సినిమా పరిస్థితి ఏంటంటే?
అయితే ఈ సినిమా యూనిట్ మొత్తం నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ సెట్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సమయం లో పవన్ కళ్యాణ్ ని కలవాల్సిన అవసరం ఏంటి?, టికెట్ హైక్స్ కూడా ఇచ్చేసారు కదా? అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ చిత్ర నిర్మాత నాగవంశీ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కోసమే మూవీ టీం తో కలిసి పవన్ కళ్యాణ్ ని కలిసారని కొంతమంది అంటుంటే, మరికొంత మంది మాత్రం టికెట్ హైక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడం కోసం కలిసారని అంటున్నారు. కారణం ఏదైనా కానీ, ఇప్పుడు కింగ్డమ్ మూవీ టీం పవన్ కళ్యాణ్ ని కలవడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: విజయ్ దేవరకొండలో ఎందుకింత వైరాగ్యం!
ఒకపక్క పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం థియేటర్స్ లో ఆడుతుంది. నేటితో సరిగ్గా వారం రోజులు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా మీ సినిమాతో పోటీ పడేందుకు మేము రావడం లేదు సార్, తప్పుగా అనుకోకండి అనే అర్థం వచ్చేలా నాగవంశీ కలిసి ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే కింగ్డమ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో కూడా మొదలైంది. ఓవర్సీస్ మరియు హైదరాబాద్ లో తప్ప, ఈ చిత్రానికి ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. ఇలా అయితే ఈ చిత్రం హిట్ 3 ఓపెనింగ్ రికార్డు ని అందుకోవడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి , అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.