Kingdom 10 Days Collections: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ బాక్స్ ఆఫీస్ ఫలితం మాత్రం దారుణంగా వచ్చింది. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నిర్మాత నాగవంశీ స్పీడ్ కి ఈ చిత్రం బ్రేకులు వేసింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచార ప్రకారం, ఈ చిత్రానికి 30 శాతానికి పైగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. పది రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి, ఒక్కో సెంటర్ నుండి ఎంత డబ్బులు పోయాయి, సినిమా ఓవరాల్ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. ఈ చిత్రానికి మొదటి నుండి మంచి ట్రెండ్ ని చూపిస్తూ వచ్చిన ప్రాంతాలలో ఓవర్సీస్ ఒకటి.
కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 9 లక్షల డాలర్లు వచ్చాయి. అంటే తృటిలో 1 మిలియన్ ప్రీమియర్ మార్కుని మిస్ అయ్యింది అన్నమాట. రేటింగ్స్ కూడా బాగా ఇచ్చారు, ఇక ఈ సినిమా గట్టెకేస్తుందని అంత అనుకున్నారు. కానీ రెండవ రోజు నుండి ఎవ్వరూ ఊహించని విధంగా వసూళ్లు పడిపోయాయి. రెండు మిలియన్ డాలర్లకు ఈ సినిమాని కొనుగోలు చేస్తే 17 లక్షల డాలర్లు మాత్రమే వచ్చింది. దీనికి మించి ఇప్పుడు ఒక్క పైసా కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇక నైజాం పరిస్థితి కూడా అంతే. విజయ్ దేవరకొండ కి బలమైన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మొదటి నాలుగు రోజుల వీకెండ్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి కానీ, వర్కింగ్ డేస్ లో ఇక్కడ దారుణంగా పడిపోయింది. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
అదే విధంగా సీడెడ్ లో 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా 10 రోజులకు 4 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 3 కోట్ల 60 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి కోటి 90 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి కోటి 26 లక్షలు, గుంటూరు జిల్లా నుండి కోటి 85 లక్షలు, కృష్ణ జిల్లా నుండి కోటి 51 లక్షలు,నెల్లూరు జిల్లా నుండి 97 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 27 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ 40 కోట్ల రూపాయిల షేర్, 80 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 12 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి, అది దాదాపుగా అసాధ్యం అనే అనుకోవచ్చు.