King Of Kotha Collections: మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని తన వైపు తిప్పుకున్న మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్. ఇక ఆ తరువాత డబ్బింగ్ సినిమా కన్నులు కన్నులు దోచాయ్ అంతేతో వచ్చి అందరి హృదయాలను దోచేశాడు. ఇక ఈ మధ్య వచ్చిన సీతారామం సినిమా క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అంతేకాదు హిందీ వాళ్ళని కూడా చుప్ సినిమాతో మాస్మరైజ్ చేశారు ఈ హీరో.
ఇలా వరుస పెట్టి సూపర్ హిట్లు కొట్టిన ఈ హీరోకి ప్రస్తుతం తన కొత్త సినిమా మాత్రం నిరాశకు గురి చేసింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ‘జీ స్టూడియోస్’, ‘వేఫేరర్ ఫిల్మ్స్’ బ్యానర్లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.అభిలాష్ జోషి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.యాక్షన్ ఎపిసోడ్స్, కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ కూడా ఉంటాయనే భరోసా ఇచ్చింది. దాంతో ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ చవిచూసింది.
ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఎమోషనల్ కనెక్టివిటీ లేదు అని ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో ఓపెనింగ్స్ సో సో గానే నమోదయ్యాయి. ఇక మొత్తం పోయిన సినిమా ప్రస్తుతం 25 కోట్ల నష్టం తెచ్చి పెట్టినట్లు సమాచారం.
40 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందించారని తెలిసింది. మలయాళం నుంచి తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో రికార్డు స్థాయి స్క్రీన్ కౌంట్‌తో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొచ్చారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఇక్కడ 1000 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 250 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాకు మలయాళంలో మాత్రమే భారీ ఓపెనింగ్స్ దక్కాయి. తమిళం, తెలుగులో మోస్తరు వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో రూ.5కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అంటే బ్రేక్ ఈవెన్ 5.50కోట్లు. అంటే ఈ చిత్రానికి ఇక్కడ రూ.4,95కోట్లు వస్తేనే క్లీన్ హిట్ స్టేటస్ అందుకుంటుంది.ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ.1.05కోట్ల గ్రాస్, రూ. 55 లక్షల షేర్ వసూలు చేసి ఇక్కడ కూడా ఫ్లాప్ గానే నిలిచింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.40కోట్లకుపైగా బిజినెస్ చేసింది. కానీ ఈ సినిమా మొత్తం పైన 15 కోట్లు మాత్రమే రన్ ముగిసే సరికి దక్కించుకోవచ్చని, దీంతో ఇక మొత్తం పైన 25 కోట్ల నష్టం ఈ సినిమా చవిచూడనున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో ప్రొడ్యూసర్లకు కోత మిగిల్చింది ఈ సినిమా.