Miss Shetty Mr Polishetty: ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా ఏలిన అనుష్క ఈ మధ్య సినిమాల స్పీడు తగ్గించేసింది. 2019లో చిరంజీవి సైరా సినిమాతో వెండితెరపై మెరిసింది స్వీటి. 2020లో నిశ్శబ్ధం అనే సినిమా చేసినా ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంటే అనుష్క సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి దాదాపు నాలుగేళ్లు అయిపోవస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఎంతో నిరుత్సాహపడుతూ రోజులు గడిపారు.
కానీ వారందరినీ ఖుషి చేస్తూ చాలాకాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.
సెప్టెంబర్ 7న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. దీంతో మూవీ పై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ గురించి టాలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ మొత్తం కూడా నవీన్ పోలిశెట్టి మాత్రమే చూసుకుంటున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ లో టూర్ వేస్తూ మూవీని ప్రేక్షకులోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా కేవలం ఒక్కడే తన సినిమా కోసం కష్టపడుతున్నాడు.
అంతేకాదు ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండకపోవచ్చట. ఉన్నా కానీ ఆ ప్రమోషన్స్ కి అనుష్క రాకపోవచ్చట. అనుష్క పాల్గొనాల్సి వచ్చే ఏ ఈవెంట్.. ప్రెస్ మీట్ మరేదీ వుండదు అని తెలుస్తోంది. ఫోన్ లో మాట్లాడే ఎఫ్ఎమ్ ఇంటర్వూలు తప్ప అనుష్క డైరెక్ట్ గా ఏ ప్రమోషన్ కి రాదు అని వార్తలు వినిపిసవినిపిస్తున్నాయి. మరి అనుష్క ఎందుకు ఇలా చేస్తోంది అనేది అందరి సందేహం.
కొంతమంది మాత్రం అనుష్క బాగా లావు అయిందని.. ఆ విషయం తెలిస్తే మీడియా వారు అనేక కథనాలు ప్రచారం చేస్తారని.. అందుకే తాను మీడియాకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంటున్నారు. మరి ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికి భారం మాత్రం మొత్తం నవీన్ పైనే పడింది.