https://oktelugu.com/

Bangarraju Movie: సంక్రాంతి పండక్కి ఏడుగురు భామలతో వస్తున్న “బంగార్రాజు”

Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ చిత్రంలో వీరి సరసన రమ్య కృష్ణ, కృతి శెట్టి లు హీరోయిన్లుగా చేస్తుండగా… కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 08:33 PM IST
    Follow us on

    Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ చిత్రంలో వీరి సరసన రమ్య కృష్ణ, కృతి శెట్టి లు హీరోయిన్లుగా చేస్తుండగా… కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

    ఈ కార్యక్రమంలో నాగార్జున, కృతి శెట్టి తోపాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ మేరకు బంగార్రాజు సినిమా జనవరి 14న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్న కానీ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నామని తెలిపింది మూవీ టీమ్. ఎప్పటి నుంచో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నాగార్జున చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తతో నాగ్ అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

    ఈ సంధర్భంగా నాగార్జున మాట్లాడుతూ మరో ఇంటరెస్టింగ్ వార్తను రివిల్ చేశారు. ఈ సినిమాలో ఒక సాంగ్ లో 77 హీరోయిన్స్ నటించనున్నట్లు చెప్పారు నాగార్జున. గతంలో నాగ్ నటించిన కింగ్ సినిమాలో ఒక సాంగ్ కోసం కూడా హీరోయిన్స్ అందరూ ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ వార్తతో అక్కినేని అభిమానుల్లో పూనకాలు ఖాయం అని సినీ వర్గాల్లో తలోక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.