https://oktelugu.com/

Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ” రాధే శ్యామ్ ” కొత్త రిలీజ్ డేట్ ఇదేనా ?

Radhe Shyam Movie: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది అని మూవీ యూనిట్ ప్రకటించారు. కానీ ఇప్పుడు సడెన్ గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కారణాలు చాలానే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 08:24 PM IST
    Follow us on

    Radhe Shyam Movie: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది అని మూవీ యూనిట్ ప్రకటించారు. కానీ ఇప్పుడు సడెన్ గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.

    దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు. నార్త్ లో కొన్ని థియేటర్లను కూడా మూసేశారు. సౌత్ లో కూడా థియేటర్ల విషయంలో చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చేశాయి. ఏపీలో టికెట్ రేట్ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే భారీ బడ్జెట్ సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ‘రాధేశ్యామ్’ను కూడా పోస్ట్ పోన్ చేయక తప్పలేదు.

    అయితే కొత్త రిలీజ్ డేట్ ని మూవీ యూనిట్ మాత్రం ప్రకటించలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించి ఆ టైంకి రిలీజ్ చేయకపోతే ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రిలీజ్ కి 20 రోజుల ముందుగా డేట్ అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ‘రాధేశ్యామ్’ సినిమాను మార్చి నెలలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. మార్చి 18 ‘రాధేశ్యామ్’ థియేటర్లలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా… తమన్ బీజియమ్ అందిస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ నెలకొంది.