https://oktelugu.com/

Bangarraju Movie: బంగార్రాజు నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కింగ్ నాగార్జున… ఏంటంటే

Bangarraju Movie: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అప్పట్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. సంక్రాంతి బరిలో మరో మూడు సినిమాలు ఉన్నప్పటికీ… ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. విడుదల అయిన వారం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 03:22 PM IST
    Follow us on

    Bangarraju Movie: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అప్పట్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. సంక్రాంతి బరిలో మరో మూడు సినిమాలు ఉన్నప్పటికీ… ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. విడుదల అయిన వారం తర్వాత థియేటర్లు కూడా పెరిగాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఈ ‘బంగార్రాజు’.

    Bangarraju Movie

    ముందు నుంచి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనేది నాగార్జున ఆలోచన. ‘ఎప్పుడు వచ్చినా ఆ సినిమాను సంక్రాంతి పండక్కి తీసుకొస్తా’ అని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే… 2022 సంక్రాంతి బరిలో తొలుత నాలుగైదు సినిమాలు ఉండటంతో ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లా నాయక్’, ‘రాధే శ్యామ్’ ఉన్నప్పుడు ఏదైనా వాయిదా పడితే ‘బంగార్రాజు’ను తీసుకురావాలని అనుకున్నారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ వాయిదా పడింది. దాంతో నాగార్జున అండ్ ‘బంగార్రాజు’ టీమ్ దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. నాగ చైతన్య, నాగార్జున మరొకసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    Also Read: నాగార్జున నిర్లక్ష్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది !

    తాజాగా ఈ చిత్రంకి సంబంధించిన ఒక అప్డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేటితో ఈ చిత్రం షూటింగ్ లాస్ట్ డే అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక ఈ సినిమా లో ఇంకో అదిరి పోయే పాట ఉందంటూ తెలిపారు నాగార్జున. ఈ మేరకు చైతూ, కృతి శెట్టి కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ పోస్ట్ లో పండగ లాంటి సినిమా, బంగార్రాజు త్వరలో వస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల పై త్వరలో క్లారిటీ రానుంది.

    Also Read: ప్చ్.. తెలుగు సినిమా పై ఇంత చుల‌క‌న భావమా ?